Ayodhya verdict: అయోధ్య-బాబ్రీ మసీద్ తీర్పు... ఏపి డిజిపి హెచ్చరిక

By Arun Kumar P  |  First Published Nov 9, 2019, 4:22 PM IST

అయోధ్య-బాబ్రి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో  ప్రజలందరూ సయంమనం పాటించాలని డిజిపి గౌతమ్ సవాంగ్ సూచించారు. ముఖ్యంగా మీడియా మిత్రులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.  


అమరావతి:  అయోధ్య-బాబ్రీ మసీద్ తీర్పు నేపథ్యంలో ప్రజలందరు సంయమనంతో మెలగాలని రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్ సూచించారు. ఎలాంటి విద్వేశాలను రెచ్చెగొట్టకుండా శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా మీడియా మిత్రులు వార్తాప్రసారాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాని సూచించారు. 

మీడియా సంస్థలు, పాత్రికేయులు సమాజ హితాన్ని దృష్టిలో వుంచుకుని సున్నితమైన, మతపరమైన అంశాలు, సంఘటనలను రిపోర్ట్ చేసేపుడు ముందూ వెనకా ఆలోచించాలన్నారు. సంస్థ యాజమాన్యాలు కూడా  ప్రసారం చేయడంలో సంయనమం పాటించాలని వినతి చేసుకున్నట్లు తెలిపారు. 

Latest Videos

ఇటువంటి ఘటనలను రిపోర్ట్, మరియు ప్రసారం చేసే సందర్భంలో అప్తమత్తతతో స్థానిక పోలీస్ అధికారుల నుండి వాస్తవాలను తెలుకుని నిజాలతో కూడిన వార్తలను ప్రజలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలో మతపరమైన అలజడులు లేకుండా కట్టుదిట్టమైన శాంతిభద్రతల కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలకు దయచేసి సహకరించాలని ఆయన కోరారు. 

read more   Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , తుది తీర్పు ముఖ్యాంశాలు ఇవే..

 వార్తల విషయంలో హిందూ, ముస్లిం వంటి భావనలతో కాకుండా పూర్తి నిజాలను స్థానిక పోలీస్ అధికారులతో విచారించిన తరువాతే ప్రసారం చేయాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఐకమత్యం, దేశభక్తి, సమైక్యతలను చాటుకునేందుకు అందరూ ముందుకు రావాల్సిన సమయమిదని డిజిపి పేర్కొన్నారు.   

కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ... అయోధ్య తీర్పు ను దృష్టిలో ఉంచుకుని జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాలలో పోలీసులను మొహరించినట్లు తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ, సోషల్ మీడియాలో ఎటువంటి ఆధారాలు లేని పోస్టులు షేర్ చేయవద్దని.. అలా చేసినవారికి కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. 

మచిలీపట్నంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అలాగే జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ ప్రాంతాలలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.

read more  చిత్తూరు బాలికపై అత్యాచారం, హత్య... మహిళా కమీషన్ ఛైర్మన్ ఏమన్నారంటే

గుంటూరు అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ... మతపరమైన అలజడులు లేకుండా కట్టుదిట్టమైన శాంతిభద్రతల కోసం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని...వాటికి ప్రజలే కాదు మీడియా కూడా సహకరించాలన్నారు. వార్తల ప్రసారం విషయంలో స్థానిక పోలీస్ అధికారులతో సంప్రదించి నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. 


 

click me!