ఇసుక అక్రమ రవాణా ఆ మంత్రి ఆదీనంలోనే...: వర్ల సంచలన ఆరోపణలు

సామాన్యుడు ఇసుక కొరత తో చస్తూ బ్రతుకుతుంటే మంత్రులు మాత్రం అక్రమ రవాణా చేయడం ఎంత వరకు సమంజసమని టిడిపి నాయకులు వర్ల రామయ్య ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదన్నారు.  


విజయవాడ: రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులకు పాలన మీద అవగాహన లేకపోవడం ప్రభుత్వ యంత్రాంగాలన్నీ విఫలమవుతున్నాయని టిడిపి పోలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. నిజంగా వారు ఈ ఐదు నెలలు గొప్ప పాలన అందించివుంటే ప్రజలంతా సుఖసంతోషాలతో వుండేవారన్నారు. కానీ భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలతో యావత్ రాష్ట్రం విషాదంలో మునిగి వుండేది కాదన్నారు.  

నిరుపేద ఇసుక కార్మికులు అన్నమో రామచంద్రా అంటూ ఆత్మహత్యలు చేసుకుంటే మంత్రులు వాటిపై ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్లు కాలం చెల్లి చనిపోయారని అనడాన్ని వర్ల తప్పుబట్టారు. 

Latest Videos

నిజంగానే భవన నిర్మాణ కార్మికులు కాలంచెల్లి చనిపోతే మీ ప్రభుత్వం ఎందుకు కార్మిక కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారన్నారు. ఓ వైపు కార్మిక ఆత్మహత్యలు లేవంటూనే పరిహారం చెల్లించారంటే మీరు అబద్దాలాడినట్లు ఒప్పుకున్నట్లే కదా అని అన్నారు. 

read more చంద్రబాబుకు షాక్ ఖాయమేనా...? రామ్ మాధవ్ తో గంటా భేటీ

ఇక మరో మంత్రి బొత్స సత్యనారాయణ పోలీసులు ఇసుక అక్రమ రవాణాధారులను నుండి  లంచాలు తీసుకుంటున్నారని అన్నట్లు పేర్కొన్నారు. నిజానికి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నదే బొత్స సత్యనారాయణ  అని సంచలన ఆరోపణలు చేశారుమ. 

ఇసుక అక్రమ రవాణా సంబంధించి  ఓ ఎంపీకి మంత్రికి మధ్య గొడవ జరుగుతున్నాయని అన్నారు. బొత్స సత్యనారాయణ 50 ఇసుక లారీలు ఉన్నాయని ఆరోపించారు. ఆయన ఇసుక రవాణాపై ఆధిపత్యం సాధించేందుకు పాకులాడుతున్నారని అన్నారు.ఆయనకున్న 50 లారీలు ఎవరి బినామీగా వున్నాయని ప్రశ్నించారు. ఇవన్నీ తెలిసినా ముఖ్యమంత్రి మాత్రం బొత్స సత్యనారాయణ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. 

సామాన్యుడు ఇసుకలేక చస్తూ బ్రతుకుతుంటే మంత్రులు మాత్రం అక్రమ రవాణా చేయడం ఎంత వరకు సమంజసంగా వుందన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదన్నారు. 

భార్యపై అనుమానం... కన్న కొడుకునే కిరాతకంగా చంపిన కసాయి తండ్రి

 ఏసీబీ కంటే దోపిడీ దొంగలే నయం అని స్వయంగా ఉపముఖ్యమంత్రి అంటున్నారని...ఇలాంటివి చూస్తుంటే ప్రభుత్వం ఉన్నట్లా అని ప్రశ్నించారు. నిజా నిజాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రిగా  జగన్ కు లేదా? అని ప్రశ్నించారు. ఇసుకకు సంబంధించి ముఖ్యమంత్రికి చిత్త శుద్ధి ఉంటే ఒక స్ట్రాంగ్ పోలీస్ బందోబస్త్ ని పెట్టాలన్నారు. 

 ఇసుక అక్రమ రవాణా మీద టీడీపీ అధ్యక్ధుడు ఆయన చంద్రబాబు 14వ తేదీన ఒక్కరోజు దీక్ష చేయనున్నారన్నారు.ఆ ఒక్కరోజు దీక్ష ఈ ప్రభుత్వం పీకలకు చుట్టుకోబోతోందన్నారు.
 


 

click me!