బాబు పర్‌ఫెక్ట్ టైలర్... జగన్ సూపర్ కటింగ్ మాస్టర్: లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Mar 13, 2020, 1:25 PM IST

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను టైలర్లతో పోలుస్తూ మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. 


గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థానికసంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను తగ్గించడంపై వచ్చిన ఓ కార్టూన్ ను మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. ఇందులో చంద్రబాబు, జగన్ ఇద్దరిని టైలర్లతో పోల్చారు. అయితే చంద్రబాబు పర్‌ఫెక్ట్ స్టిచ్చింగ్ మాస్టర్ కాగా జగన్ ను సూపర్ కటింగ్ మాస్టర్ అంటూ లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

''ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు మంచి కటింగ్ మాస్టర్. చట్టబద్దంగా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్ చేసి 24 శాతానికి తగ్గించారు. రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ బీసీలను దెబ్బతీస్తూ... ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా అమలు చేస్తున్నాం అని కటింగ్ ఇస్తున్నారు'' అంటూ తాను పోస్ట్ చేసిన కార్టూన్ గురించి వివరించారు లోకేష్.

. గారు మంచి కటింగ్ మాస్టర్. చట్టబద్దంగా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్ చేసి 24 శాతానికి తగ్గించారు. రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ బీసీలను దెబ్బతీస్తూ... ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా అమలు చేస్తున్నాం అని కటింగ్ ఇస్తున్నారు. pic.twitter.com/iiX6Yh25Xp

— Lokesh Nara (@naralokesh)

Latest Videos

 

''పోటీ చేసి గెలిచే దమ్ము లేక సీఎం జగన్ గారు దద్దమ్మ లా అడ్డదారులు తొక్కుతున్నారు. రాక్షస రాజ్యంలో నామినేషన్ వేసే హక్కు కూడా లేదా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒక పక్క పోలీసులను మరో పక్క అధికారులను వైకాపా నాయకుల్లా వాడుకుంటున్నారు''
 
''టీడీపీ అభ్యర్థుల పై అక్రమ కేసులు పెడుతున్నారు, నామినేషన్ పత్రాలు చించేస్తున్నారు. ఏకపక్షం చేసుకోవడానికి దాడులకు దిగుతున్నారు. అధికారులే నామినేషన్ వేసే హక్కుని హరిస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు?'' అంటూ ప్రభుత్వం, అధికారులు, వైసిపి నాయకులను విమర్శించడమే కాదు ప్రశ్నలు కూడా సంధించాను నారా లోకేష్. 
 

click me!