దళిత యువతి పట్ల వెకిలిచేష్టలు, సోదరుడిపై దాడి... ఇరువర్గాల మధ్య ఘర్షణ (వీడియో)

By Arun Kumar P  |  First Published Sep 11, 2020, 11:13 AM IST

ఎస్సీ యువతిపై ఓ వర్గం యువకులు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. 


గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని మరుప్రోలువారిపాలెంలో ఓ వివాహ వేడుకలో దళిత యువతిని కొందరు యువకులు వేధించడం మొత్తం గ్రామంలోనే అలజడికి కారణమయ్యింది. ఎస్సీ యువతిపై ఓ వర్గం యువకులు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. తన సోదరి గురించి అసభ్యంగా మాట్లాడొద్దని చెప్పిన యువతి సోదరుడిపై కూడా యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. 

గ్రామంలో చెలరేగిన ఉద్రిక్త పరిస్థితుల గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామ సచివాలయ ఉద్యోగి వివాహ వేడుకల కోసం కొందరు యువకులు మరుప్రోలువారిపాలెం గ్రామానికి వచ్చారు. అయితే వారు అదే గ్రామానికి చెందిన ఓ దళిత యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. యువతి పట్ల వెకిలిగా ప్రవర్తించడాన్ని గమనించిన ఆమె సోదరుడు వారిని అదుపుచేసే  ప్రయత్నం చేయగా అతడిని కూడా సదరు యువకులు చితకబాదారు. 

Latest Videos

read more   విశాఖలో విషాదం... ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తల ఆత్మహత్య

విషయం తెలిసిన బాధిత కుటుంబం ఈ దుర్ఘటనపై ప్రశ్నించడానికి వెళ్లగా వారితోనూ గొడవకు దిగారు. ఇలా ఈ వివాదం పెరిగి గ్రామంలోని రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. గ్రామంలోని ఓ వర్గం వారికి, ఎస్సీ కాలనీవాసులకు మధ్య తోపులాట జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడినుండి పంపించారు.

బాధిత యువకుడు దాసరి భాస్కర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయ్యప్పరెడ్డి అనే వ్యక్తితో పాటు మరో 11 మంది నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.  

వీడియో

"

click me!