గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం చింతలపాలెం గ్రామ మాజీ సర్పంచ్ ఇంటిపై వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం చింతలపాలెం గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షుడు కడియం కోటి సుబ్బారావు ఇంటిపై వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సర్వేపల్లి కోటేశ్వరరావు, సర్వేపల్లి వెంకట్ సుబ్బారావులు మాజీ సర్పంచ్ ఇంట్లోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేశారు.
వైసిపి నాయకుల దాడి సమయంలో సుబ్బారావుతో పాటు అతడు కుటుంబసభ్యులు ఎవరూ ఇంటివద్ద లేరు. ఎవరైనా వుండివుంటే తమపైనా దాడికి పాల్పడేవారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
undefined
read more ఆయన మంత్రా, వీధి రౌడీనా?: కొడాలి నానిపై సిపికి ఫిర్యాదుచేసిన టిడిపి
ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు నెల్లూరు జిల్లా టిడిపి కార్యకర్త శ్రీకాంత్ రెడ్డికి పోలీసులు ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నం చేయగా ఆయన ధీటుగా సమాధానం చెప్పారు. తాను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి బెదిరింపులకు లొంగేది లేదంటూ... చట్టప్రకారం ఏ చర్యలు తీసుకున్నా సిద్ధం అంటూ శ్రీకాంత్ రెడ్డి ఫోన్లోనే పోలీసులకు ధైర్యంగా సమాధానం చెప్పాడు. ఇలా ఆయన పోలీసులతో మాట్లాడిన ఫోన్ కాల్ సంబాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదికాస్తా టిడిపి అధినేత చంద్రబాబు దాకా వెళ్ళి స్వయంగా ఆయనే సదరు కార్యకర్తకు ఫోన్ చేసేలా చేసింది.
శ్రీకాంత్ రెడ్డికి చంద్రబాబు ఫోన్ చేసి మరీ అభినందించారు చంద్రబాబు. బెదిరింపులకు లొంగకుండా చాలా ధైర్యంగా మాట్లాడావని... ఎలాంటి కష్టం వచ్చినా మీకు నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛని కాపాడుకోవడానికి మాట్లాడిన తీరుని ప్రశంసించారు చంద్రబాబు.
పోలీసు వ్యవస్థ ప్రజల్ని రక్షించే విదంగా ఉండాలని... కానీ వైసిపి ప్రభుత్వం బెదిరింపులకు, రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం దారుణమన్నారు. పోలీసు వ్యవస్థ లో పారదర్శకత కోసమే టిడిపి హయాంలో బాడీవోర్న్ కెమెరాలు ప్రవేశపెట్టామన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాసే అధికారం ఎవ్వరికి లేదు... తప్పు చెయ్యని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు.
రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలులో లేదని... రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. టిడిపి నేతల అరెస్టుల విషయంలో ఇది స్పష్టంగా అర్థం అవుతుందని పేర్కొన్నారు. కానీ ఒక కార్యకర్తగా మీరు పోలీసులకు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గుర్తుచేసారని...ఈ ధైర్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటూ శ్రీకాంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు చంద్రబాబు.