అమరావతి పతనమే కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్: జగన్‌పై జయదేవ్ వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Jan 14, 2020, 11:27 AM IST

ఎలక్షన్ టైం లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇచ్చారని తెలిసిందేనని, అమరావతి పతనాన్ని కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని జయదేవ్ ఆరోపించారు.


ఎలక్షన్ టైం లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇచ్చారని తెలిసిందేనని, అమరావతి పతనాన్ని కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని జయదేవ్ ఆరోపించారు. తుళ్ళూరు మండలంలో 144 సెక్షన్,30 పోలీస్ యాక్ట్ మహిళలు,రైతులపై ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.

తుళ్లూరులో భోగి వేడుకల్లో ఆయన పాల్గొని జియన్ రావు,బోస్టన్ కమిటీ నివేదికలు మంటల్లో వేశారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ.. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ అమలుపై హైకోర్టు ఆగ్రహించిందని గుర్తుచేశారు. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే 144 సెక్షన్ ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు.

Latest Videos

undefined

Also Read:అమరావతి రగడ: సంక్రాంతి సంబరాల్లోనూ కొనసాగుతున్న నిరసనలు

పోలీసు డిపార్ట్మెంట్ పై హైకోర్టు మండిపాటు,రైతులకు సంతోషాన్నిచ్చే విషయమని జయదేవ్ అభిప్రాయపడ్డారు. టెర్రరిస్టులు,నక్సల్స్‌తపై వాడే చట్టాన్ని రైతులు, మహిళలు పై ఎందుకు పెట్టాలని గల్లా నిలదీశారు. ప్రజాస్వామ్యంలో హక్కులను కలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు.

శుక్రవారం హైకోర్టు తుది తీర్పు సందర్భంగా చీఫ్ సెక్రటరీ, కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీలు హాజరవ్వాల్సి వస్తుందని ఆయన గుర్తుచేశారు. సెక్షన్ 144 తొలగిస్తే రైతులకు ఊరట లభిస్తుందని, అమరావతి ఆందోళనలు మరింత ఉధృతం చేయ్యవచ్చని జయదేవ్ తెలిపారు.

ప్రభుత్వం రాజధాని అమరావతి ఒకటే అనే వరకు ఈ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. జగన్ మెంటర్ కేసీఆర్ ని కలిశారు,ఆరుగంటలు ఏకాంతంగ భేటీ అయ్యారని.. ఏమి మాట్లాడుకున్నారో తెలియపరచలేదని గల్లా సెటైర్లు వేశారు.

అమరావతి ని ముడుముక్కలు చేస్తున్నారని హరీశ్ రావు,రేవంత్  మాటలను బట్టి చూస్తే  అర్ధమవుతుందని ఆయన విమర్శించారు. అమరావతి మూడు రాజాధానుల ప్రకటన వల్ల హైదరాబాద్ చాలా సంతోషంగా ఉందన్నారు.

Also Read:రాజకీయాల నుండి తప్పుకొంటా, ఇలా చేస్తారా: జగన్ కు బాబు సవాల్

మూడు ముక్కలు చేసిన తరువాత హైదరాబాద్ డెవలప్‌మెంట్ బాగా పెరిగిపోతుందని థాంక్స్ టూ జగన్-థాంక్స్ టూ ఆంధ్రప్రదేశ్ అని జగన్‌కి కేసీఆర్, కేటీఆర్ చెప్పారని జయదేవ్ గుర్తుచేశారు.

హైదరాబాద్ నుండి అమరావతి కి దూరం తక్కువని, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రావాళ్లు వచ్చి అమరావతి లో పెట్టుబడులు పెడుతున్నారని కుట్ర చేస్తున్నారని తెలుస్తుందని గల్లా ఆరోపించారు. రాజధాని మూడు ముక్కలు చెయ్యడం వల్ల తెలంగాణాకి ఎంతో బాగుంటుందని గల్లా వ్యాఖ్యానించారు.

అమరావతి గురించి ఇద్దరు సీఎం లు మాట్లాడకుండా,తెలంగాణా  ప్రాజెక్టులగురించి మాట్లాడుకున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం,అమరావతి గురించి మర్చిపోయి, మిగతా వాటి గురించి మాట్లాడతారన్నారు. జగన్ సీఎం గా ఉన్నంత వరకు తెలంగాణాకే లాభమని, ఏపీకి చెడు రోజులని గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!