అమరావతి రగడ: సంక్రాంతి సంబరాల్లోనూ కొనసాగుతున్న నిరసనలు

By Siva KodatiFirst Published Jan 14, 2020, 10:52 AM IST
Highlights

రాజధానిలో సంక్రాంతి సంబరాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా పండగపూట ప్రతి ఇంటి ముందు చక్కటి రంగవల్లికలతో, అమరావతి పరిసర గ్రామాలు కళకళలాడేది. అయితే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో రాజధానిలో పండుగ వాతావారణ కరువైంది

రాజధానిలో సంక్రాంతి సంబరాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా పండగపూట ప్రతి ఇంటి ముందు చక్కటి రంగవల్లికలతో, అమరావతి పరిసర గ్రామాలు కళకళలాడేది. అయితే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో రాజధానిలో పండుగ వాతావారణ కరువైంది.

Also Read:రాజకీయాల నుండి తప్పుకొంటా, ఇలా చేస్తారా: జగన్ కు బాబు సవాల్

ఇప్పటికే క్రిస్మస్, న్యూఇయర్ సంబరాలకు దూరమైన రాజధాని వాసులు అతిపెద్ద పండుగ సమయంలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం వెలగపూడి లో ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ రంగవల్లికతో రైతుల భావాన్ని వ్యక్తపరిచారు. తుళ్ళూరులో సేవ్-అమరావతి అనే రంగవల్లికతో వారి ఆకాంక్ష తెలియజేసారు.

జియన్ రావు ,బోస్టన్ కమిటీ నివేదికల ప్రతులను భోగి మంటల్లో వేసి ప్రజలు వారి నిరసన తెలియజేస్తున్నారు. అదే సమయంలో పండుగతో పాటు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 144 సెక్షన్ ఎత్తివేయాలని పోలీస్ యంత్రాంగం ఉన్నట్లు సమాచారం. పండుగ పర్వదినాల దృష్ట్యా మూడు రోజుల పాటు 144 సెక్షన్ ఎత్తివేయాలని పోలీసులు భావిస్తున్నారు. 

టీ కాచిన మాజీ ఎంపీ మాగంటి

రాజధాని గ్రామాల్లో నిరసన తెలియజేసేందుకు వచ్చిన టీడీపీ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. తుళ్లూరులోని ఓ టీ దుకాణంలో టీ కాచిని ఆయన.. షాపు యజమాని యోగక్షేమాలు తెలుసుకున్నారు.

భోగి మంటల కార్యక్రమంలో ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జియన్ రావు,బోస్టన్ కమిటీ నివేదికలు మంటల్లో వేసి జై అమరావతి-జై జై అమరావతి అని నినాదాలు చేశారు. 

పెదవడ్లపూడిలో భోగీ మంటలతో నిరసన

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని పెదవడ్లపూడి గ్రామస్తులు జి యన్ రావు,బోస్టన్ ప్రతిపాదనలను, మరియు హై పవర్ కమిటీ అజెండాల ను  భోగి మంటల్లో  దహనం చేసి నిరసన వ్యక్తం చేసారు.

Also Read:ఏపీ రాజకీయాల్లోకి నందమూరి సుహాసిని .. రాజధాని రైతులే టార్గెట్

నాయకులు సొంత నిర్ణయాలతో కమిటిలు వేసి వారి నిర్ణయాలను ప్రజలుకు ఆపాదించటం సరికాదన్నారు. నాయకులు సొంత నిర్ణయాలతో కమిటిలు వేసి వారి నిర్ణయాలను ప్రజలుకు ఆపాదించటం సరికాదని, అధికార పార్టీకి ఇది సరైన విధానం కాదని గ్రామస్తులు హితవు పలికారు. 

జిల్లా కలెక్టర్‌కు నిరసన సెగ:

కృష్ణా జిల్లా కలెక్టర్‌కు రాజధాని నిరసన సెగ తగిలింది. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేసేందుకు వచ్చిన కలెక్టర్‌ను స్థానిక వాకర్స్ అడ్డుకున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, అధికారులు కలగజేసుకుని కలెక్టర్‌ను అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు.

click me!