బిజెపితో పవన్ దోస్తీ... టిడిపిదే ఆలస్యం: రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Jan 13, 2020, 9:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ తాజా రాజకీయపరిణాలపై మాట్లాడిన మాజీ ఎంపీ, టిడిపి నాయకులు రాయపాటి సాంబశివరావు టిడిపి భవిష్యత్ రాజకీయాలపై  ఆసక్తికర కామెంట్స్ చేశారు.  


అమరావతి: దేశ ప్రధాని నరేంద్ర మోదీతో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో విభేదించి టిడిపి అధినేత తప్పు చేశారని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా మించిపోయింది లేదు మోడీని కలవాలని చంద్రబాబు నాయుడుకి సీనియర్లమంతా చెబుతామని అన్నారు. మళ్లీ తెలుగుదేశం, బిజెపి, జనసేన కలుస్తాయన్న నమ్మకం తనకు వుందన్నారు. 

రాజధాని పరిధిలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. రాజధాని ప్రజలెవరూ అధైర్యపడొద్దని చెప్పారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కావాలంటే పులివెందులలో రాజధాని పెట్టుకోవాలి కానీ అర్థంపర్థం లేకుండా మూడు రాజధానులు ఏర్పాటుచేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తేలేదన్నారు. 

Latest Videos

మూడు రాజధానుల ఆలోచనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేపట్టిన పోరాటం ఆపకూడదని సూచించారు. శృతిమించుతున్న పోలీసులపై తిరగబడాలని ఆయన రాజధాని ప్రజలకు సూచించారు. 

read more  జగనన్న బాణం, రాజన్న బిడ్డ ఇప్పుడేమయ్యింది: షర్మిలపై దివ్యవాణి సైటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. గత రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీతో పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ఈ మేరకు వారికి అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. 

పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం ఆయన ఆర్ఎస్సెస్ నేతలతో సమావేశమైన జనసేనాని.. ఇవాళ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అమరావతి తరలింపు, మూడు రాజధానుల గురించి వీరిద్దరూ ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్ల జరిగిన నష్టాలను విశ్లేషించినట్లుగా తెలుస్తోంది. 

హైపవర్ కమిటీ సమావేశం...రాజధానిపై చర్చించిన అంశాలివే

భవిష్యత్ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నడ్డా తెలపడంతో అందుకు పవన్ కూడా సానుకూలంగా స్పందించారని జనసేన వర్గాల టాక్. ఏపీలో వైసీపీ ఎదుర్కోవాలంటే బీజేపీతో పొత్తు అవసరమని పవన్ కల్యాణ్ కూడా భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ టూర్ ప్లాన్ చేసుకున్నారు. జనసేన, బీజేపీలతో పొత్తు ఖరారైతే స్థానిక సంస్థల నుంచి రెండు పార్టీల మధ్య మైత్రి బంధం ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

click me!