ఏపి రాజధాని మార్పు, శాసనమండలి రద్దు వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న జగన్ ప్రభుత్వాన్ని ఆ దేవుడు కూడా కాపాడలేరని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డిపై టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికన వారిద్దరిని టార్గెట్ చేస్తూ వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు.
''వైఎస్ జగన్ గారు, విజయసాయి రెడ్డి గారు పత్రికలు, పాత్రికేయ విలువలు గురించి మాట్లాడితే నవ్వొస్తుంది. ప్రజాధనం దోచి ఘనంగా బ్లాక్ పేపర్, ఛానల్ నిర్వహిస్తున్న మీరు ఇతర పత్రికలు,ఛానల్స్ ఏమి రాయాలో చెబుతున్నారా?''
''అసలు మీ బ్లాక్ పేపర్,ఛానెల్ లో ఒక్క రోజైన పాత్రికేయ విలువలు పాటించినట్టు గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పే దైర్యం ఉందా సాయిరెడ్డి గారు?''
''అవాస్తవాలు,అసత్యాలు,అభూత కల్పనలు తప్ప సత్యం అనే అర్ధమే తెలియని బ్లాక్ పేపర్, ఛానల్ గురించి మీరు గొప్పలు చెప్పడం ఏంటి విజయ్ గారు''
read more ఆ బిల్లులను ఆపడంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం...: టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు
''నారా చంద్రబాబు నాయుడు గారికి సంకటం ఏర్పడితే నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్లావు విజయసాయి రెడ్డి. బిల్లు సంకటంలో పడి కుడితిలో పడ్డ ఎలుకలా వైఎస్ జగన్ గారు కొట్టుకుంటున్నారు కాబట్టే కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకోవడానికి మిమల్ని ఢిల్లీ పంపారు అన్న విషయం అందరికీ అర్ధం అయ్యింది.''
''చేసే చెత్త పనులకు జై కొట్టాలని ప్రధాని మోడీ గారు, అమిత్ షా కాళ్లు పట్టుకొని జగన్, మీరు మొక్కడం అందరూ చూసారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసిన వాళ్ల దగ్గరకు మరోసారి దేహి అని వెళ్లారు. మండలి రద్దుకి సహకరించాలని ఫెడరల్ ఫ్రంట్ అధ్యక్షుడిని వేడుకుంటున్నారు విజయసాయి రెడ్డి గారు.''
''క్షుద్ర పూజలకు బ్రాండ్ అంబాసిడర్ మీరే కదా విజయసాయి రెడ్డి గారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని క్షుద్ర పూజలు చేయించావు. ఇప్పుడు ఆయన తీసుకున్న తుగ్లక్ మూడు ముక్కలాట గట్టు ఎక్కాలని కాళహస్తి దేవాలయంలో క్షుద్ర పూజలు చేయించారు.''
read more ఏపి శాసనమండలి రద్దు... ఆర్టికల్169 ఏం చెబుతోందంటే..: కనకమేడల
''ఇన్ని చేయించినా మీ చెత్త నిర్ణయాలకు దైవం అడ్డుపడింది. మండలి రద్దు బిల్లు పార్లమెంట్ లో వీలైనంత త్వరగా పాస్ చేయించుకోవాలి అని కలలు కంటున్నావు.''
''అభివృద్ధి ప్రణాళిక లేకుండా నువ్వు మొదలు పెట్టిన మూడు ముక్కలాట గురించి ప్రజలకు అర్ధం అయ్యింది. అన్నకి ఇచ్చింది ఒక్క ఛాన్సే అదే ఆయనకి లాస్ట్ ఛాన్స్ అని ప్రజలు అంటున్నారు విజయసాయి రెడ్డి గారు.'' అంటూ వరుస ట్విట్లతో వెంకన్న జగన్, విజయసాయిరెడ్డిలపై ఘాటు విమర్శలు చేశారు.