వికేంద్రీకరణ దిశగా మరో అడుగు... ఉత్తర్వులు జారీచేసిన జగన్ ప్రభుత్వం

By Arun Kumar PFirst Published Jan 28, 2020, 5:56 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వికేంద్రీకరణ దిశగా మరో అడుగు వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోవడమే కాదు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కీలక  నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ముఖ్య పట్టణాభివృద్ధి సంస్ధల పరిధులు పెంచుతూ వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది. 

గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (గుడా), తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) పరిధులను పెంచింది. అలాగే అనంతపురం, హిందూపూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల పరిధులను కూడా పెంచింది. 

read more  

గుడా పరిధిలోకి కొత్తగా 4 పట్టణ స్ధానిక సంస్ధలు, 236 గ్రామాలు చేరాయి. తాజా మార్పుతో గుడా పరిధి 4388 చ.కి.మీకు పెరిగింది. ఇక తుడా పరిదిలోకి నగరి మున్సిపారిటీతో పాటు 413 గ్రామాలు చేరాయి. తాజా మార్పుతో తుడా పరిధి 4527 చ.కి.మీకి పెరిగింది. 

అహుడా పరిధిలోకి రాప్తాడు నియోజకవర్గంలోని ఐదు గ్రామాలు (రాప్తాడు, రామగిరి, ఆత్మకూరు, చెన్నెకొత్తపల్లి, కనగానపల్లి గ్రామాలు) చేరాయి. ఈ తాజా మార్పుతో అహుడా పరిధి
 6591 చ.కి.మీకి పెరిగింది. 

read more  ఆ బిల్లులను ఆపడంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం...: టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు

ఇప్పటికే రాష్ట్ర వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ వికేంద్రీకరణలో భాగంగానే ముఖ్య నగరాల పరిధిని పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

click me!