భువనేశ్వరి గాజుల విరాళంపై వివాదం...మేమేం గాజులు తొడుక్కోలేదు: కంభంపాటి

By Arun Kumar P  |  First Published Jan 3, 2020, 5:43 PM IST

అమరావతిలో తాను ఇన్సైడ్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు ప్రకటించడాన్ని టిడిపి నేత కంభంపాటి రామ్మోహన్ తప్పుబట్టారు. తాజు పార్టీలకు అతీతంగా వ్యాపారాలు చేస్తున్నానని... తనను వివాదంలో లాగడం ఎంతవరకు సమంజసమన్నారు. 


గుంటూరు: అమరావతి రైతులు భూములు కోల్పోవడమే కాకుండా వైసిపి ప్రభుత్వ నిర్ణయాలతో భవిష్యత్ అందకారంగా మారుతుందని నిరసనలకు దిగారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపైకి వచ్చిన అమరావతి రైతులకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మద్దతిచ్చారు. ఈ క్రమంలోనే నూతన సంవత్సరాది రోజున ఆయన భార్య భువనేశ్వరితో కలిసి రైతుల దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన చేతికున్న గాజులను అమరావతి ఉద్యమానికి  విరాళంగా ఇవ్వడంపై వివాదం కొనసాగుతోంది. 

దీనిపై తాజాగా టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు స్పందించారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపిన నారా భువనేశ్వరిని వైసిపి నేతలు విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆమె రైతుల ఆవేదనను చూసి చలించిపోయి మాత్రమే అప్పటికప్పుడు తన చేతి గాజులు విరాళంగా ఇచ్చారని... దీన్ని రాజకీయం చేయడం తగదన్నారు. 

Latest Videos

అలాగే అమరావతి ప్రాంతంలో తనకు భూములున్నట్లు... ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు వైసిపి మంత్రులు  తన పేరు బయటపెట్టడంపై కంభంపాటి స్పందించారు. 37సంవత్సరాలలో నాకు ఎవరితో ఎటువంటి తగాదాలు లేవన్నారు. ఎన్టీఆర్ పిలుపు మేరకే టిడిపి సిద్ధాంతాలతో పని చేసానని తెలిపారు.

read more  అమానుషం...మీ నిర్ణయాన్ని కాదంటే వాహనాలు ఎక్కిస్తారా...?: చంద్రబాబు ఫైర్

గత ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తారనే ప్రజలు వైసీపీ కి అధికారమిచ్చి జగన్ ను సీఎం చేశారన్నారు. కానీ జగన్ మాత్రం రాష్ట్ర అభివృద్దిని మరిచి రాజకీయ కక్ష సాధింపులపై దృష్టి సారించారని ఆరోపించారు. 

గత అసెంబ్లీలో కూడా జగన్ అమరావతి రాజధానిని సమర్ధించారని కంభంపాటి గుర్తుచేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిపినట్లు తన పేరును మంత్రులు బయటపెట్టడం విడ్డూరంగా వుందని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేని వ్యాపారం తాను చేసుకుంటున్నానని పేర్కొన్నారు. 2006లో కొన్న భూమికి ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఆపాదించారని...అసలు ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదమే పెద్ద భూతు  అని కంభంపాటి వ్యాఖ్యానించారు. 

ఒక సామజిక వర్గం, ఒక పార్టీ మీద కక్ష్య సాధింపు చర్యలకు వైసిపి ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన మంత్రులతో హైపవర్ కమిటీలు వేశారని ఆరోపించారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడ ఉంది..? అని కంభంపాటి ప్రశ్నించారు. ఆయన నేరస్థులు కాబట్టి మిగతావారు నేరస్థులు అనడం సరికాదన్నారు. 

ఇన్ సైడర్ జరిగింది అంటున్నారు కదా చట్ట పరమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జ్యుడీషియల్ కమిటీ వేయాలని తాము డిమాండ్ చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఏడు నెలల్లో వైసీపీ చేసింది ఏమి లేదన్నారు. 

read more  టిడిపి ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై చర్యలేమయ్యాయి...: ప్రశ్నించిన బోండా ఉమ

2006లో కొన్న భూమిని ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటున్నారని... ఇది తప్పని  ప్రకటించి క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కుని కూర్చోలేదని హెచ్చరించారు.

రాజధానిని మార్చడానికి కాదు వైసీపీకి అధికారం ఇచ్చింది...వైసీపీ ఇదే పనిచేస్తే కాలమే సమాధానం చెబుతుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా తన నిర్ణయాన్ని మార్చుకుంటే మంచిదని సూచించారు. 


 

click me!