మందడంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలనపై పోలీసులు జులుం ప్రదర్శించారని... తమ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారిని ప్రభుత్వం ఇలా పోలీసులను ఉపయోగించిన ఇబ్బందులకు గురిచేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు.
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ సాగుతున్న ఉద్యమం శుక్రవారం ఉద్రిక్తంగా మారింది. సకలజనుల సమ్మె సందర్బంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రాజధాని గ్రామాల రైతులు, మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మందడంలో నిరసనకు దిగిన మహిళలపై పోలీసుల వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.
మందడం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి భూములిచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నవాళ్లపై పోలీసులు జులుం ప్రదర్శించడంపై చంద్రబాబు మండిపడ్డారు.
రైతులపైకి పోలీసు వాహనాలను నడిపి గాయాలపాలు చేయడం అప్రజాస్వామికమని ఆరోపించారు. వేలాది పోలీసులను గ్రామాల్లో దించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని... తమ భూముల్ని రాష్ట్ర శ్రేయస్సు కోసం త్యాగం చేసిన వాళ్ళను ఇంత దారుణంగా హింసిస్తారా ..? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.
read more ఆ మహిళలే పోలీసుల్ని రెచ్చగొట్టారు... అందుకు సాక్ష్యాలివే: గుంటూరు ఎస్పీ
ఇంట్లోంచి బయటకు రావడానికి భయడే మహిళలను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తరలించడం అమానుషమన్నారు. రైతులపై, మహిళలపై అక్రమ కేసులను తక్షణం ఎత్తేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజధాని గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని... రైతులు, మహిళల్లో నెలకొన్న ఆందోళనలు తొలగించే చర్యలు చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటే రైతులు చేపట్టిన ఉద్యమం ఉదృతమయ్యింది. శుక్రవారం సకల జనుల సమ్మెను ప్రారంభించిన రాజధాని ప్రజలు స్వచ్చందంగా తమ కార్యకలాపాలకు దూరంగా వుండి భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. వీరి నిరసనలు... పోలీసులు భారీ బందోబస్తులతో అమరావతి ప్రాంతమైంతా ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలో మందడం గ్రామంలో నిరసన చేపట్టిన మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఉద్రిక్తతలకు దారితీసింది. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే అకారణంగా తమను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు, గ్రామస్తులు నిరసనను మరింత ఉదృతం చేశారు.
Capital Crisis : భూములిచ్చి రోడ్డున పడ్డామంటూ అమరావతి రైతుల మానవహారం
మహిళలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడానికి ప్రయత్నించగా గ్రామస్తులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మహిళలను బస్సులో తరలిస్తుండగా అడ్డుగా నిలిచి ముందుకు కదలనివ్వలేదు. దీంతో చేసేదేమిలేక పోలీసులే వెనక్కితగ్గి బస్సులోని మహిళలందరిని అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు.
స్థానిక పోలీసులు వ్యవహార శైలిని ఖండిస్తూ నినాదాలు చేశారు. పోలీసుల ప్రవర్తన దారుణంగా వుందంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసుల నిరంకుశ వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు.