ఆ మహిళలే పోలీసుల్ని రెచ్చగొట్టారు... అందుకు సాక్ష్యాలివే: గుంటూరు ఎస్పీ

By Arun Kumar P  |  First Published Jan 3, 2020, 3:48 PM IST

రాజధాని కోసం అమరావతి ప్రజలు చేపట్టిన సకలజనుల సమ్మె సందర్భంగా మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై గుంటూరు  అర్బన్ ఎఎస్పీ విజయరావు వివరణ ఇచ్చారు.  


అమరావతి: అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ 29 గ్రామాల ప్రజలు నిరసన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తూ సకలజనుల సమ్మెకు దిగడంతో కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇలా మందడంలో నిరసనకు దిగిన మహిళలను అరెస్ట్ చేయడానికి స్థానిక పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 

ఈ క్రమంలో పోలీసులు మహిళలపై దాడి చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఎస్పీ విజయరావు స్పందించారు. సకలజనుల సమ్మెలో భాగంగా మందడం గ్రామానికి చెందిన కొందరు మహిళలు స్థానికంగా వున్న ఓ బ్యాంక్ ను బలవంతంగా మూయించడానికి ప్రయత్నించారన్నారు. రోడ్డుపై వున్న ఈ బ్యాంక్ వద్ద మహిళలు గుంపుగా రావడంతో అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లారని తెలిపారు.

Latest Videos

undefined

అమరావతిలో ఉద్రిక్తత... మహిళలే వారి టార్గెట్

బ్యాంక్ వద్ద ట్రాపిక్ ను క్లియర్ చేస్తున్న పోలీసులపై కొందరు మహిళలు అమర్యాదగా ప్రవర్తిస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని అన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా దాడి చెయ్యలేదని ఎస్పీ పేర్కొన్నారు. 

సచివాలయం వెళ్లే ప్రధాన రహదారుల్లో బొడ్డురాయి సెంటర్ కూడా ఒకటని... ఇక్కడే గత 16 రోజులనుండి రైతులు ధర్నాలు,ఆందోళనలు చేస్తున్నారన్నారు. అయినప్పటికి వారిని పోలీసులు ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదన్నారు. హైకోర్ట్, సచివాలయం ఉద్యోగస్తుల ప్రయాణానికి ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. హైకోర్ట్ ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని ఎస్పీ వెల్లడించారు. 

టిడిపి ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై చర్యలేమయ్యాయి...: ప్రశ్నించిన బోండా ఉమ

ఇదే విషయంపై తుళ్ళూరు డిఎస్పీ వై శ్రీనివాసరెడ్డి  మాట్లాడుతూ... ప్రస్తుతం మందడంలో శాంతియుత వాతావరణం ఉందన్నారు. నిరసన తెలుపుతున్న మహిళలను దీక్షా శిబిరం వద్దకు వెళ్లాలని సూచించామని...  అయితే పోలీసులు హెచ్చరికలను వారు పట్టించుకోకపోవడంతో గందరగోళం నెలకొందని తెలిపారు. 

పోలీసుల మాటను వినిపించుకోకుండా విఐపిలు ప్రయాణించే రహదారిపై మానవహరం చేపట్టడంతో మహిళలను దీక్షా శిబిరం వద్దకు తీసుకు వెళ్లేందుకు బస్సు ఎక్కించడం జరిగింది.

 మహిళలను బస్ ఎక్కించిన సమాచారం తెలుసుకుని వెంటనే సంఘటన స్థలానికి అడిషనల్ ఎస్పీ చక్రవర్తితో కలిసివెళ్లి పరిశీలించినట్లు డిఎస్పీ తెలిపారు. దీక్షా శిబిరానికి వెళ్తామన్న రైతుల హామీ మేరకు బస్సు నుండి మహిళలును దింపడం జరిగిందని...మహిళల్ని ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని వివరించారు.

click me!