దిశా చట్టం అమలుకు సంబంధించి ఏపి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిణి కృతికా శుక్లా జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్పిరెన్స్ నిర్వహించారు.
విజయవాడ: సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి అనుగుణంగా దిశా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఇటీవల నియమింపబడిన ప్రత్యేక అధికారి కృతికా శుక్లా ఆదేశించారు. దిశా చట్టం విధివిధానాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె 13 జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జనవరి చివరికల్లా అన్నిజిల్లాల్లోని విద్యాలయాలు, కళాశాలల్లో దిశా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేయడమే కాదు దిశా మహిళా పోలీస్ స్టేషన్లు ,దిశా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం జగన్ ఆదేశాలతో ఈ జనవరి నెలను దిశా నెలగా పరిగణిస్తున్నామన్నారు. దిశా చట్టానికి ఇంకా రాష్ట్రపతి ఆమోదముద్ర రావాల్సి ఉందన్నారు.
undefined
మహిళల కోసం దేశంలో ఎక్కడా లేని విదంగా సీఎం జగన్ దిశా చట్టం తెచ్చారని అన్నారు. చట్టం అమలుకు ప్రతి ఒక్కరూ నిబద్దతో పనిచేయాలని... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
READ MORE జగన్మోహన్ రెడ్డి బాటలో ఉద్ధవ్ థాక్రే
సీఎం ఆలోచనలకు అనుగుణంగా మహిళా సంరక్షణకు దిశా చట్టం అమలుపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.మహిళా శిశు సంక్షేమశాఖ స్కీముల ద్వారా బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వన్ స్టాప్ సెంటర్ లను దిశా హెల్త్ సెంటర్లుగా ఏర్పాటు చేస్తామని...వైఎస్సార్ కిశోరీ వికాసం స్కీమ్ కింది ప్రాథమిక స్థాయినుంచే సెల్ఫ్ డిఫెన్స్ పై అవగాహన కల్పిస్తామన్నారు కృతికా శుక్లా.
చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ, కఠిన శిక్షలు విధించేందుకు గాను అసెంబ్లీ ఆమోదించిన దిశ చట్టం అమలు, పర్యవేక్షణకు గాను ఏపీ ప్రభుత్వం ఇటీవలే ప్రత్యేకాధికారులను నియమించింది.ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారిణి దీపికలను అధికారులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కామాంధుల చేతిలో దారుణ హత్యకు గురయిన దిశ పేరిట ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం చట్టంప్రకారం, నిర్భయ కేసుల్లో జైలు లేదా మరణదండనను శిక్షగా విధిస్తుంటే తాజాగా రాష్ట్రం ప్రవేశపెట్టిన చట్టం ద్వారా రేప్ చేసినవారికి తప్పనిసరిగా మరణదండన విధిస్తారు.
READ MORE దిశ చట్టం అమలు...ఎస్పీలకు డిజిపి గౌతమ్ సవాంగ్ సూచనలివే
నిర్భయం చట్టం ప్రకారం 2 నెలల్లో దర్యాప్తు పూర్తి, మరో 2 నెలల్లో శిక్షలు పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ ఈరెండూ పూర్తికావాలి. దీన్ని ఏపీ దిశ చట్టంలో 4 నెలలకు కాదు 21 రోజులకు కుదించారు. అత్యాచార నేరాల్లో విస్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్లయితే 21 రోజుల్లోపే నిందితుడికి శిక్ష పడాలి. వారంరోజుల్లో పోలీసు దర్యాప్తు పూర్తికావాలి. 14 రోజుల్లోపే న్యాయప్రక్రియ పూరెయి శిక్షపడాలి.
అత్యాచార సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘‘పోక్సో’’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్ష విధించవచ్చు. కానీ రాష్ట్రంలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలుచేసినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో శిక్ష అవుతుంది.
read more దిశ నిందితులకు మరో 9 కేసులతో లింకులు: ఆధారాలు సేకరించిన పోలీసులు
సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాంటివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. ఈ చట్టం ద్వారా మెయిల్స్‌ద్వారా గాని, సోషల్ మీడియాద్వారా గాని, డిజిటల్ విధానంలోగాని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లయితే మొదటి తప్పుకు 2 ఏళ్లు, ఆతర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను తీసుకు వచ్చారు.