ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక కొరతను నివారించేందుకు వైసిపి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యంగాస్త్రాలు సంధించాడు. ముఖ్యంగా టోల్ ఫ్రీ నంబర్ ను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.
విజయవాడ: గతకొంతకాలంగా వైఎస్సార్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన వైఎస్సార్‌సిపి అధినేత, ముఖ్యమంత్రి జగన్ పాలనపై విరుచుకుపడుతూ విజయసాయిరెడ్డిపై సెటైర్లు విసిరారు.
''అవినీతి గురించి మాట్లాడే ముందు దోచిన 43 వేల కోట్ల ప్రజాధనం ప్రజలకు పంచి స్టేట్ మెంట్లు ఇవ్వండి. అంతే కాని అధికారులంతా అవినీతి పరులే అనే ముద్ర వేసి మీరు సచ్చీలులుగా బిల్డ్ అప్ ఇవ్వకండి @VSReddy_MP గారు''
undefined
read more ఆయనో ఫినాయిల్ సాయి రెడ్డి .. వైసీపీ నేతపై విరుచుకుపడ్డ బుద్ధ వెంకన్న
''అన్నట్టు కాల్ సెంటర్ నెంబర్ తప్పు చెప్పారు ఏంటి ? మీరు కొట్టేసింది 43 వేల కోట్లు కదా, కాల్ సెంటర్ నెంబర్ 43000 అని పెడితే కరెక్ట్ గా ఉండేది.''
''@ysjagan గారు, మీరు కలిసి అవినీతి మీద పోరాటం చేస్తారా @VSReddy_MP గారు. ఎన్నికలకు ముందు ప్రజల చెవిలో హామీల పువ్వులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా క్యాబేజీ పెట్టేస్తున్నారు గా.. '' అంటూ వరుస ట్వీట్లతో ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై వెంకన్న విరుచుకుపడ్డారు.
అంతకుముందు ఇసుక కొరతపై కూడా ప్రభుత్వం, వైసిపి పై వెంకన్న విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. ''ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం చెంచాడు, వైకాపా నాయకులకు వచ్చిన ఆదాయం బిందెడు.''
read more ఆ కథేంటో తేల్చుకుందాం రండి: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న సవాల్
''63 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అంటున్నారు, వైకాపా నేతలు 30 లక్షల మంది కార్మికులను పస్తులు పెట్టి మెక్కేసిన 630 కోట్ల గురించి, ఇసుక బూచిగా చూపించి జగన్ గారు సిమెంట్ కంపెనీల నుండి వసూలు చేసిన 1600 కోట్ల గురించి కూడా చెప్పండి.''
''డబ్బు పై మీకు, @ysjaganగారికి ఉన్న పిచ్చిని మరో సారి బయట పెట్టారు @VSReddy_MPగారు. ఇసుక ద్వారా 63 కోట్ల ఆదాయం వచ్చింది అని గొప్పగా చెబుతున్నారు. మీ జగన్ గారి చెత్త నిర్ణయాల వలన 50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే కనీసం వారి గురించి బాధ కూడా లేదు మీకు'' అంటూ టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు.