టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ల్యాండ్ పూలింగ్ నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.. సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ల్యాండ్ పూలింగ్ నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
చంద్రబాబు అమరావతి ప్రాంత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. లక్ష కోట్ల బడ్జెట్ వేసి..4 వేలకోట్లు మాత్రమే రాజధాని కి ఉపయోగించారని... ఇంతకంటే అన్యాయం ఉందా అని ఆయన ధ్వజమెత్తారు.
2015 అక్టోబర్ లో ప్రధాని శంఖుస్థాపన చేస్తే అమరావతి కి 3 ఏళ్లలో 4900 కోట్లు, అంటే సంవత్సరానికి 1500 కోట్లు మాత్రమే ఊపయోగించారని బొత్స పేర్కొన్నారు. అంటే ఈ లెక్కన చంద్రబాబు రాజధానిని ఎప్పటికి కడదామని అనుకున్నాడంటూ మంత్రి విమర్శించారు.
Also Read:చంద్రబాబు అమరావతి పర్యటనకు రైతుల నుంచి చుక్కెదురు
చంద్రబాబు ఏమాత్రం బాధ్యత లేకుండా పాలన చేసి.. అమరావతిని ఒక స్మశానంలా మిగిల్చారని సత్యనారాయణ ధ్వజమెత్తారు. కనీసం భూములు తీసుకున్న రైతులకు అయనా ఫ్లాట్ లు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన బాధ్యతను సైతం గత ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.
ఈ రాజధాని అనే స్మశానాన్ని చూడడానికి మంగళవారం చంద్రబాబు వస్తున్నాడని రైతులు ఇవన్నీ అడగాలని బొత్స సూచించారు. రాజధాని కి రైతులకు G.O. ప్రకారం రావాల్సిన అన్ని హామీలు నెరవేర్చుతామని మంత్రి స్పష్టం చేశారు.
దేశంలో అవినీతి ఆపడానికి ఒక toll ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని బొత్స గుర్తుచేశారు. పవన్ కల్యాణ్‌కి రాష్ట్రంలో జరుగుతున్నవి కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రస్తుతం గుంటకాడ నక్కలాగా మారాడని.. గత ప్రభుత్వంలో 42వేల కోట్ల అప్పులు మిగిల్చారని ధ్వజమెత్తారు. తాను గతంలో మూడు సార్లు మంత్రిగా ఉన్నానని ఎప్పుడూ ఇలాంటివి జరగలేదన్నారు.
అమరావతి ని కేంద్రం గుర్తించింది మావల్లే అని చంద్రబాబు అనడం హాస్యాస్పదమని సత్యనారాయణ విమర్శించారు. టీడీపీ ఎంపీలు 5 రోజుల్లోనే సాధించామని చెబుతున్నారని.. మరి గత ఐదేళ్లు ఏం చేశారని బొత్స నిలదీశారు.
బాబు ఎప్పుడు ఎవరిని పొగుడతాడో... ఎవరిని వదిలేస్తాడో తెలియదని మండిపడ్డారు. తాము ఏ పార్టీకి దగ్గర కాదని.. ఏ పార్టీకి దూరం కాదని, జగన్ ప్రభుత్వం ప్రజలకు మాత్రమే దగ్గరని సత్యనారాయణ స్పష్టం చేశారు.
Also Read:టీడీపీని అణచివేయాలని కుట్ర.. మీలాగే చేసుంటే: జగన్‌పై బాబు తీవ్ర వ్యాఖ్యలు
అధికారం చేపట్టిన 6 నెలల్లో ఎన్నికల హామీల్లో తాము నెరవేర్చినన్ని హామీలు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. ఒకవేళ ఎవరైనా చేశామని నిరూపిస్తే తల దించుకుంటానని మంత్రి సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సంక్రాంతి తర్వాత మొదలు పెడతామని బొత్స వెల్లడించారు.