టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని విమర్శించి డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి పై టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు.
గుంటూరు: రాజధాని రైతులు, మహిళలు గత పదిహేను రోజుల నుంచి తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసలు చేస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రాజధాని రైతుల కన్నీరు చూసి నారా భువనేశ్వరి నూతన సంవత్సరం వేడుకను పక్కనబెట్టి మహిళలకు సంఘీభావం తెలియజేయాలనే సంకల్పంతో రాజధానికి రావడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో భాగంగానే చేతి గాజులు విరాలళంగా ఇవ్వడం జరిగిందన్నారు.
తన భర్త సీఎంగా పనిచేసిన కాలంలో కూడా భువనేశ్వరి మొదటి నుంచి కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు అవమానకరంగా మాట్లాడటం దారుణమన్నారు.
గతంలో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పావలవడ్డీకి రుణాలు ఇవ్వని సమయంలో మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ గుమ్మం తొక్కిన మహిళలకు, నిరుద్యోగులకు, ఆనారోగ్యం ఉన్న వారికి ఆర్థికపరంగానే కాదు అన్ని విధాలుగా ఆదుకున్న మహా తల్లి భువనేశ్వరి అని కొనియాడారు.
read more బంగాళాఖాతంలో ద్రోణి... మరో 24 గంటలు పొంచివున్న వర్షం ముప్పు
ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పుష్ప శ్రీవాణికి అసలు రాజధాని పరిధి ఎంతో తెలుసా? సీఆర్‌డీఏ అంటే ఏమిటో తెలుసా?అని అనురాధ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల కంటే ముందు సీల్కింగ్ ప్లాంటు సంస్థ దగ్గర కొనుగోలు చేసిన భూములను కొట్టేశారని దారుణంగా మాట్లాడుతున్నారని... అలా కొట్టేస్తే యాక్షన్ తీసుకోమని ఇప్పటికు తమ నాయకుడు చంద్రబాబు చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. మీరెందుకు ఆ పని చేయడం లేదని నిలదీశారు.
పరిపాలన అంటే టిక్ టాక్ వీడియోలు చేసినంత ఈజీ కాదని పుష్ప శ్రీవాణి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆమె రాష్ట్రంలో రైతుల సమస్యలు తెలుకొవడం మానేసి టిక్ టాక్ వీడియోలో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆమె గిరిజనురాలు కాకున్నా ఆ కోటాలో సీటు పొందినట్లు అభియోగాలున్నాయని... ఇలా గిరిజనులకు సీటు లేకుండా చేశారని అన్నారు. ఈ విషయంపై హైకోర్టు నోటీసు ఇవ్వడం కూడా జరిగిందని... దాని గురించి సమాధానం చెప్పాలని అనురాధ డిప్యూటి సీఎంను ప్రశ్నించారు.
ఆమెను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యేను కలవాలంటే శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఒక వ్యక్తి కావాలని అంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేను చూడాలంటే టిక్ టాక్‌లో చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటిది ఆమె భువనేశ్వరి గురించి మాట్లాడే అంతటి వారా? అని మండిపడ్డారు.
read more డ్రగ్స్ మత్తులో ఎస్సైపైకి కారెక్కించిన యువకులు...స్పందించిన డిజిపి
అభివృద్ధి అంటే డేటా సంస్థలను, ఆదానీ, లూలూ గ్రూప్, ప్రకాశం జిల్లాలో పేపరు మిల్లు, కియా అనుబంధ సంస్థలను వెళ్లగొట్టడం కాదన్నారు. ప్రభుత్వం ప్రతి డిపార్ట్‌మెంట్‌కు సాక్షి పీఆర్‌వోను పెట్టుకున్నారని... వారు ఏది ఇస్తే అది చదవడం కాదు నిజాలు మాట్లాడాలని అనురాధ వైసిపి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.