పవన్ కల్యాణ్ దూకుడుకు అడ్డుకట్ట... వైసిపి ప్రభుత్వం కీలక నిర్ణయం

By Arun Kumar P  |  First Published Jan 1, 2020, 2:45 PM IST

ఇటీవల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు నిరసనలు చేపట్టిన  విషయం తెలిసిందే. తాజాగా అమరావతి రైతులకు మద్దతుగా  ఉద్యమంలో పాల్గొన్నారు. ఇలా తమను ఇరకాటంలో పెడుతున్న అతడిపై చర్యలు తీసుకునేందుకు దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నారు.  


అమరావతి: రాజధానిని తరలించరాదంటూ ఉద్యమం చేస్తున్న అమరావతి ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఆయన మంగళవారం స్వయంగా రైతులకోసం నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన సచివాలయం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తమ ఆజ్ఞలు అతిక్రమించినందుకు పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

పవన్ కల్యాణ్ రాజధాని పర్యటన నేపథ్యంలో వెంకటపాలెం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. తమను ముందకు వెళ్లనివ్వకుండా ఆడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించినందుకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం.

Latest Videos

read more  పవన్ కల్యాణ్ ను అడ్డుకుంటారా... నేనూ అదే చేసుంటే...: జగన్ పై చంద్రబాబు ఫైర్

అంతేకాకుండా తాము అనుమతించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో పవన్ ప్రయాణించారు. దీంతో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిందని పేర్కొంటూ సెక్షన్ 144,30 యాక్ట్ ను బ్రేక్ చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తుళ్లూరు పోలీసులు సిద్దమైనట్లు తెలుస్తోంది. 

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినప్పటి నుండి పవన్ కల్యాణ్ ప్రభుత్వం వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. ప్రజల సమస్యలపై ప్రత్యక్షంగా పోరాటానికి దిగారు. ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టడంతో పాటు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలకు  దిగుతున్నారు. దీంతో అతడి దూకుడుకు కళ్లెం  వేయాలని... అందుకు అవకాశం కోసం వైసిపి ప్రభుత్వం ఎదురుచూస్తోంది. 

read more  అధికారంలో వుండగా ఆ తప్పు చేశా... ఫలితమే: చంద్రబాబు ఆవేదన

తాజాగా పవన్ పోలీసుల విధులకు ఆటంకం కలగించడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పవన్ పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇలా పోలీస్ కేసులతో పవన్ దూకుడును అడ్డుకోవచ్చని వైసిపి  పెద్దలు భావిస్తున్నారు. 

click me!