వికారాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గస్తీ నిర్వహిస్తున్న నవాబ్ పేట ఎస్సై కృష్ణ పై కొందరు ఆకతాయిలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవుల సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనపై తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి స్పందించారు. 

''నూతన సంవత్సర వేడుక బందోబస్త్ లో యాక్సిడెంట్ కు గురి అయిన వికారాబాద్ ఎస్సై శ్రీకృష్ణ త్వరగా కోలుకోవాలని వేడుకొంటున్నాను. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ప్రమాదాలకు గురైనా, వ్యక్తిగతంగా నష్టం జరిగినా మొక్కవోని ధైర్యం విశ్వాసంతో మీరు ప్రజలకు అందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను'' అంటూ  డిజిపి ట్వీట్ చేశారు. 

read more  కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్: కవిత

ఎస్సైపై దాడికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అనంతగిరి ఫారెస్ట్ ప్రాంతంలో కొందరు తాగుబోతులు పార్టీ జరుపుకున్నారు. ఈ క్రమంలో బందోబస్తులో భాగంగా తన సిబ్బందితో కలిసి ఎస్సై కృష్ణ అటువైపు వెళ్లారు. దీన్ని గమనించిన ఆకతాయిలు పారిపోడానికి ప్రయత్నిస్తూ ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. 

ఓవర్ స్పీడుతో కారులో పారిపోడానికి ప్రయత్నించి రోడ్డుపక్కన నిల్చున్న ఎస్సైని ఢీకొట్టారు. దీంతో ఎస్సై తీవ్రంగా గాయపడినా సిబ్బంది అప్రమత్తమై ఈ దారుణానికి పాల్పడినవారిని పట్టుకున్నారు. అనంతరం తీవ్రంగా గాయపడిని ఎస్సైని ఆస్పత్రికి తరలించారు. 

read more  సిరిసిల్ల ఘటనపై ఎస్పీ సీరీయస్: నలుగురు పోలీసులపై వేటు

ఈ ఘటనలో పట్టుబడిన నిందితులు హైదరాబాద్ కు చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్‌గా గుర్తించారు. వారు డ్రగ్స్ మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరి చేతిలో గాయపడ్డ ఎస్సై పరిస్థితి బాగానే ఉందని... కానీ కాలు ప్రాక్చర్ అయినట్లు డాక్టర్లు తెలిపారు.