జగన్ అవినీతిపై ఆ దేశాల్లో అధ్యయనాలు...: నిమ్మల సైటైర్లు

Arun Kumar P   | Asianet News
Published : Mar 12, 2020, 07:48 PM IST
జగన్ అవినీతిపై ఆ దేశాల్లో అధ్యయనాలు...: నిమ్మల సైటైర్లు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద అవినీతిపరుడని... ఆయన అక్రమ సంపాదనపై వివిధ దేశాల్లో అద్యయనాలు జరుగుతున్నాయని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విరుచుకుపడ్డారు.  

గుంటూరు: తెలుగువారి సంక్షేమం కోసం ఉద్బవించిన తెలుగుదేశం పార్టీపై ఉన్మాద వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ పిచ్చిప్రేలాపలను చేస్తున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఆమంచి రౌడీ చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని.... ఆయనపై ఇప్పటివరకు నమోదైన కేసులే ఇందుకు నిదర్శనమని అన్నారు. 

తన స్వార్థం కోసం ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి మారడమే ఆయన నైజమని విమర్శించారు. టీడీపీలో ఉన్నప్పుడే జగన్ తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశారని... దీంతో 2019 ఎన్నికల్లో ఆమంచిని ప్రజలు చీత్కరించినా బుద్ధి రాలేదని అన్నారు. 

read more  స్థానికసంస్థల ఎన్నికలు: చిత్తూరు వెనక్కి... టాప్ లో తూర్పు గోదావరి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఖాయమని గ్రహించిన వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల అవినీతికి పాల్పడి 16 నెలలు జైలు జీవితం గడిపిన జగన్ చరిత్ర ఆమంచికి తెలియదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని జే ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని... రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వైసీపీని ప్రజలు చీత్కరిస్తున్నారని అన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అభద్రతా భావంలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆమంచి టీడీపీని వీడి వైసిపిలోకి వచ్చినప్పుడు ఎంత తీసుకున్నారు? అని నిలదీశారు. సాక్షి రాసి ఇచ్చిన అబద్ధాలు ఆమంచి మాట్లాడటం మంచిది కాదని రామానాయుడు హెచ్చరించారు. 

read more  మాపై మాచర్లలో హత్యాయత్నం...స్కెచ్ వేసింది ఎక్కడంటే...: బోండా ఉమ

                 

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా