వైసిపి శ్రేణులే అలా చేస్తే రాజీనామాకు సిద్దమా?: జగన్ కు కన్నా సవాల్

By Arun Kumar P  |  First Published Mar 12, 2020, 5:43 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సవాల్ విసిరారు. వైసిపి శ్రేణులే ప్రభుత్వ ఆదేశాలను పాటించే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. 


విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న స్థానికసంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఏపి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే లు గుండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల కోసం ప్రభుత్వం ఓ బ్లాక్ మెయిలింగ్ ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని... అయితే వైసీపీ శ్రేణులే ఈ ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా పనిచేస్తే సీఎం జగన్ తన పదవి నుంచి తప్పుకుంటారా? అని కన్నా ప్రశ్నించారు. 

బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి విజన్ డాక్యుమెంట్ పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీ నారాయణలు ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కన్నా మాట్లాడుతూ...  రాష్ట్రంలో ఫ్యాక్షనిస్ట్ తరహా పాలన సాగుతొందని మండిపడ్డారు. వైసిపి తప్ప ఇతర పార్టీల అభ్యర్థులకు నామినేషన్ ఫారమ్స్  కూడా ఇవ్వడం లేదుని... దీనిపై ఎన్నికల కమిషనర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. 

Latest Videos

undefined

read more  151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు... ఎందుకు భయం : జగన్‌పై పవన్ వ్యాఖ్యలు

వైసిపి అధికారాన్ని ఉపయోగించి దౌర్జన్యంగా వీలైనన్ని ఎక్కువ స్థానాలను ఫోటీలేకుండానే ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. అందువల్లే ప్రతిపక్ష పార్టీల తరపున ఫోటీలో నిలిచి ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులను సైతం బెదిరిస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థులపై బూతుల పర్వం సాగిస్తున్నారని... కొన్నిచోట్ల మరింత రెచ్చిపోయి అభ్యర్థుల చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారంటూ కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెత్తుకొని వైసిపి నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ అరాచక పాలనకు బ్రేక్ వేయాలంటే బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థులను గెలిపించాలని కన్నా ప్రజలకు సూచించారు. 

read more  మాపై మాచర్లలో హత్యాయత్నం...స్కెచ్ వేసింది ఎక్కడంటే...: బోండా ఉమ

ఎన్నికల కమీషన్ అధికారాలను కూడా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుందని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచే ఇతర పార్టీల అభ్యర్ధులపై అక్రమాలకు పాల్పడ్డారంటూ అనర్హత వేటు వేయాలన్న కుట్రలో భాగంగానే ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.  
 

click me!