మండలి ఛైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు...మంత్రులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు

By Arun Kumar P  |  First Published Jan 23, 2020, 3:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ పై మంత్రులు మతం పేరుతో దూషించారని పేర్కొంటూ గుంటూరు ఎస్పీకి కొందరు మైనారిటీ నాయకులు ఫిర్యాదుచేశారు. వెంటనే మంత్రులపై చర్యలు తీసుసోవాలని డిమాండ్ చేశారు. 


గుంటూరు: గౌరవప్రదమైన రాజ్యంగ పదవిలో వున్న ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు అనుచిన వ్యాఖ్యలు చేయడంపై మైనారిటీ వర్గాలు భగ్గుమంటున్నాయి. నిబంధనలకు లోబడి తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ఆయనపై మండలి సమావేశం జరుగుతుండగానే మంత్రులు, వైసిపి సభ్యులు పరుష పదజాలంతో దూషించినట్లు ప్రచారం జరుగుతోంది. 

మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని ఈ స్థాయిలో అవమానిస్తారా అంటూ మైనార్టీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎండి హిదాయత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.  మండలి ఛైర్మన్ షరీఫ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు బొత్సా సత్యనారాయణ, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లపై కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. 

Latest Videos

undefined

రూల్స్ అమలులో పొరపాటు జరిగింది...బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నా...

గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసిన హిదాయత్ లిఖితపూర్వక ఫిర్యాదును అందించి మంత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... రాజ్యాంగం పరంగా విధులు నిర్వహిస్తున్న ఛైర్మన్ పై మతపరమైన దూషణలు చేయడం యావత్ ముస్లీం సమాజాన్ని అవమానపరిచినట్లుగా ఉందని  అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రులు సమాజం తలదించుకునేలా దుర్భాషలాడటం సిగ్గుచేటని విమర్శించారు. 

సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీలను అణచివేయాలని చూస్తున్నారని హిదాయత్ ఆరోపించారు. ముస్లీంల అస్థిత్వానికి వ్యతిరేకంగా ఉన్న సీఏఏకు పార్లమెంట్ లో విప్ జారీ చేసి మరీ మద్ధతు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం పట్ల యావత్ ముస్లీంలందరు వ్యతిరేకతతో ఉన్నారన్నారు. ఇప్పుడు మైనారిటీ నేతపై మంత్రుల దూషణలతో ఈ వ్యతిరేకత రెట్టింపయ్యిందని హిదాయత్ పేర్కొన్నారు. 

read more  మండలి ఛైర్మన్ కి పాదాభివందనం చేసిన అచ్చెన్నాయుడు


 

click me!