ఇన్‌సైడ్ ట్రేడింగ్ పై సీఐడి విచారణ... ఇద్దరు మాజీ మంత్రులపై 420 కేసు

By Arun Kumar P  |  First Published Jan 23, 2020, 2:29 PM IST

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మాజీ టిడిపి మంత్రుల  చుట్టూ ఉచ్కు బిగుస్తోంది. గత ప్రభుత్వ హయాంతో కీలక శాఖల బాధ్యతలు చూసిన వీరిద్దరిపై సిఐడి కేసులు నమోదయ్యాయి.  


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై సీఐడి విచారణ వేగవంతమయ్యింది. ఈ  వ్యవహారంతో సంబంధాలున్నట్లు భావిస్తూ పలువురు మాజీ మంత్రులపై కేసులు నమోదు చేసినట్లు సీఐడి ఎస్పీ  మేరీ ప్రశాంతి వెల్లడించారు. మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ లో సీఐడీ ఎస్పీ గురువారం మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఇప్పటివరకు సాగిన విచారణ గురించి వివరించారు. 

అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రులు నారాయణ ,పత్తిపాటి పుల్లారావు ,బెల్లంకొండ నరసింహాల పై కేసు నమోదు చేసినట్లు   ఎస్పీ వెల్లడించారు. తనను మభ్యపెట్టి వ్యవసాయ భూమిని కొనుగోలు చేసారని వెంకటాయపాలెంకు చెందిన దళిత మహిళ పోతురాజు బుజ్జి పిర్యాదు చేసినట్లు తమకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. 

Latest Videos

read more  సీఐడీ కేసు:796 తెల్ల రేషన్ కార్డుదారులకు అమరావతిలో భూములు

అయితే ఈ పిర్యాదుపై విచారణ జరిపిన తమకు 99 సెంట్ల భూమిని ఆమె నుండి వీరు తేలిందని... దీంతో 420,506,120b ఐపీసీ సెక్షన్ల కింద  3 కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై తాము జరిపిన విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడినట్లు ఎస్పీ ప్రశాంతి పేర్కొన్నారు. 

797  తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్‌ రాజధాని ప్రాంతంలో  భూములు కొన్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. రూ.3 కోట్లకు చొప్పున ఎకరం భూమి తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు. ఇలా రూ.220 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించామని వెల్లడించారు.

read more  రాజధాని కేసులు:ముకుల్ రోహత్గీకి అప్పగించిన జగన్ సర్కార్

తెల్లరేషన్ కార్డు హోల్డర్స్‌తో ఇలా భూములు కొనుగోలు చేయించిన వారి వివరాలపై ఆరాతీస్తున్నట్లు తెలిపారు. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.  అమరావతిలో 129 ఎకరాలు  131 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొనుగోలు చేయగా పెద్దకాకానిలో 40 ఎకరాలు  43 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొన్నారన్నారు. 

తాడికొండలో 190 ఎకరాలు  188 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ రిజిస్టర్ చేసుకొనగా తుళ్లూరులో 242 ఎకరాలు  238 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొన్నారని వెల్లడించారు.  మంగళగిరిలో 133 ఎకరాలు  148 మంది, తాడేపల్లిలో 24 ఎకరాలు  49 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్ కొన్నారన్నారు. దీనిపై విచారణ వేగవంతం చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. 


 

click me!