సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు... లోకేష్ పై మంత్రి అనిల్ దాడికి యత్నం: యనమల

By Arun Kumar P  |  First Published Jan 22, 2020, 10:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మార్పు  కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. మండలి ఛైర్మన్ విచక్షణాధికారాలను ఉపయోగించిన ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి  పంపించడంపై టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు స్పందించారు. 


అమరావతి:  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీనిపై మండలి ప్రతిపక్ష నేత స్పందిస్తూ... ఈ విషయంలో కొన్ని పొరపాట్లు వుండొచ్చు కానీ ఛైర్మన్ నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ విచక్షణాధికారం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నారని... మండలి ఛైర్మన్  కు ఈ  అధికారం వుంటుందన్నారు. 

బుధవారం బిల్లులపై చర్చ జరిగే సమయంలో మండలిలో గందరగోళ పరిస్థితులు  నెలకొన్నాయని అన్నారు. మంత్రులు పేపర్లను  చించేస్తూ హంగామా సృష్టించారని...ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను దాడిచేసే ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఛైర్మన్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారని...దీన్ని తామే తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 

Latest Videos

read more  ఛైర్మన్‌ను గ్యాలరీ నుంచి బ్లాక్‌మెయిల్ చేశారు: బాబుపై బుగ్గన ఫైర్

అసెంబ్లీలోనే ఈ బిల్లులను ప్రవేశపెట్టే విషయంలో ప్రభుత్వం కూడా రూల్స్ పాటించలేదన్నారు. అప్పుడు అసెంబ్లీలో స్పీకరుకు రూల్స్ గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలసీని తాము వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటీసులిచ్చామని... ఈ నోటీసుపై జరిగిన ఓటింగులో కూడా తామే గెలిచామని యనమల  గుర్తుచేశారు.

అసెంబ్లీలో ప్రభుత్వం బుల్ డోజ్ చేసుకుంటారేమో కానీ మండలిలో ఎలా కుదురుతుందన్నారు. రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే బిల్లులను అప్రూవ్ చేసేసుకుని ఎలా వెళ్తారని ప్రశ్నించారు. బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తే ప్రభుత్వాని వచ్చిన ఇబ్బందేంటోఅర్థంకావడంలేదని అన్నారు. 

read more  మూడు రాజధానులు: కోర్టుల్లోనూ తేల్చుకునేందుకు.. జగన్ ఎత్తుగడ

రూల్ 154 ప్రకారం మండలి ఛైర్మన్ సరయిన నిర్ణయమే తీసుకున్నారని తెలిపారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ బిల్లులను వ్యతిరేకించామన్నారు. 
ఇవాళ మండలిలో వైసిపి మంత్రులు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమని యనమల విమర్శించారు. 
 
 

click me!