ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారీ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ అనుమతి లభించింది. ఈ శాఖలో భారీస్థాయిలో డాక్టర్ల నియామకానికి సంబంధించి సీఎంవో సంబంధిత అధికారులకు ఆదేశాల జారీ చేసింది. వీటితో పాటు ఇదే శాఖలో మరికొన్ని రకాల ఉద్యోగాల భర్తీని కూడా చేపట్టడానికి ఏర్పాట్లు జరగుతున్నాయి.
ఇప్పటికే వైద్యారోగ్య శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి సీరియస్ గా వున్న విషయం తెలిసిందే. స్పెషలిస్ట్ డాక్టర్లు డిప్యుటేషన్ పై వివిధ శాఖల్లో పనిచేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వైద్య ఆరోగ్యశాఖలో అన్నిడిప్యుటేషన్లు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వారిని వెంటనే వచ్చి విధుల్లో చేరాలని సీఎంవో ఉత్తర్వులు జారీ చేసింది.
undefined
అన్ని క్రిటికల్ కేర్ యూనిట్లలో సరిపడా సిబ్బందిని అందుబాటులో వుంచాలని ఉన్నతాధికారులకు ఆదశాలు జారీ చేశారు. స్పెషలిస్ట్ డాక్టర్లు తమకు సంబంధం లేని చోట పనిచేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
read more video news : సుజనా చౌదరితో భేటీ అయిన వల్లభనేని వంశీ
ఉద్యోగాలు, ఉపాధి దిశగా చదువులు, శిక్షణ తదితర విషయాలపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్శిటీ పరిధిలో 25 స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు.
నైపుణ్యాభివృద్ధి కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు, శిక్షణ కార్యక్రమాలు, మారుతున్న టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చే బాధ్యతను యూనివర్శిటీలకు అప్పగించింది.
చదువు పూర్తిచేసుకున్న తర్వాత ఉద్యోగం, ఉపాథి పొందాలన్నదే టార్గెట్ గా ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం మిగతా సహా డిగ్రీ కోర్సులు, ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులందరికి అదనంగా ఏడాదిపాటు అప్రెంటిస్ అందివ్వనున్నట్లు తెలిపారు. అప్రెంటిస్ చేశాక కూడా ఇంకా శిక్షణ అవసరమనుకుంటే మళ్లీ నేర్పించి ఆ తర్వాతే పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఇందుకు సంబంధించి నెలరోజుల్లోగా కార్యచరణకు రూపొందించాలని సీఎం ఆదేశించారు.
read more జగన్ ఓ హిట్లర్... రివర్స్ పాలనలో అన్నిరంగాల్లో తిరోగమనమే... : యనమల
అదే నెలరోజుల్లోగా పాఠ్యప్రణాళికలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై ప్రణాళిక సిద్ధం కావాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధిశిక్షణ కార్యక్రమాలపై విడివిడిగా నిధులు ఖర్చు చేయడాన్ని నిలిపేయాలన్నారు. నిధుల వినియోగ బాధ్యతలను సీఎం ఆర్థిక శాఖకు అప్పగించారు.
ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజి రూపురేఖలు మారాల్సిందేనని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాల వారీగా నైపుణ్యం ఉన్న మానవ వనరుల మ్యాపింగ్ జరగాలని కోరారు.
స్థానికంగా వారి సేవలను పొందేలా ఒక యాప్‌ను రూపొందించాలని...దీని వల్ల ప్రజలకు నైపుణ్యం ఉన్న మానవవనరులు అందుబాటులోకి వస్తాయని జగన్ సూచించారు.