తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు కేవలం ఒక పల్నాడు ప్రాంతంలోనే కాదని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రమంతా శాంతిభద్రతల సమస్య ఉందని విమర్శించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీబాధితులు అత్యధికంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని తెలుగుతమ్ముళ్లకు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు.
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే టార్గెట్ గా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారంటూ ఆరోపించారు. అందుకే తెలుగుదేశం పార్టీ వైసీపీ బాధితుల శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఈనెల 11న ఛలో ఆత్మకూరుకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. ఇకపోతే గుంటూరు వైసీపీ బాధితుల శిబిరానికి పోలీసులు రావడం, వైసీపీ విమర్శలపై తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చించారు చంద్రబాబు నాయుడు.
వైసీపీ బాధితుల శిబిరం ప్రారంభించి ఇప్పటికి 8 రోజులయ్యిందన్నారు. 110 రోజులుగా గ్రామాలకు దూరంగా వేలాది మంది బాధితులున్నారని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ బాధితులను అధికారులు తీసుకెళ్తామంటున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.
మరోవైపు గురజాల డివిజన్‌లో 144సెక్షన్ విధించడంపై ఆయన మండిపడ్డారు. సమస్య పరిష్కారం కావాలన్నదే తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేయాలన్నదే తమ పార్టీ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు కేవలం ఒక పల్నాడు ప్రాంతంలోనే కాదని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రమంతా శాంతిభద్రతల సమస్య ఉందని విమర్శించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీబాధితులు అత్యధికంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ బాధితులంతా గుంటూరు చేరుకోవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. బాధితులందరికీ న్యాయం జరగాలని, తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన ఆస్తులకు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు.
ఈ వార్తలు కూడా చదవండి
వేడెక్కిన పల్నాడు: టీడీపీకి పోటీగా.. రేపు వైసీపీ చలో ఆత్మకూరు