కొత్త జిల్లా ఏర్పాటు విషయమై ఏపీ ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేసింది.స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
గుంటూరు: కొత్త జిల్లాల పెంపు ఆలోచన ఇప్పట్లో లేదని ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు.
శుక్రవారం నాడు ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు.కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం ఆలోచనలో ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేవు. ఈ ఏడాది నవంబర్ మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. ఇదే విషయాన్ని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాకు చెప్పారు.
సంబంధిత వార్తలు
ఎపిలో జిల్లాల పెంపు: జగన్ ఆశిస్తున్న ఫలితాలు ఇవే....
కేసీఆర్ బాటలోనే: కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ప్లాన్