అమరావతి: తిండి తిప్పలుమాని ఆందోళన, స్పృహ తప్పి పడిపోయిన రైతు

By Siva KodatiFirst Published Jan 5, 2020, 3:20 PM IST
Highlights

రాజధాని తరలింపును నిరసిస్తూ అమరావతిలో గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మందడంలో ఆదివారం నిరసనలో పాల్గొన్న ఓ రైతు స్పహ తప్పి పడిపోయాడు.

రాజధాని తరలింపును నిరసిస్తూ అమరావతిలో గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మందడంలో ఆదివారం నిరసనలో పాల్గొన్న ఓ రైతు స్పహ తప్పి పడిపోయాడు.

తాళ్లాయపాలెంకు చెందిన కొండేపాటి సుబయ్య అనే రైతు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా నిరసన దీక్షలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి ఏమి తినకపోవడంతో ఆదివారం ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తోటి రైతులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. 

Also Read:అమరావతి ఆందోళన: చంద్రబాబుపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

అమరావతి ప్రాంత ప్రజలు రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమం 19వ రోజుకు చేరుకుంది. రాజధాని శంకుస్థాపన ప్రదేశంలో  ఉద్దండరాయునిపాలెంలో గ్రామస్తులంతా పొంగళ్లు తయారుచేసి నిరసన తెలియజేశారు. 

ఆదివారమంతా తుళ్లూరుకు చెందిన మహిళలు పచ్చరంగు గాజులు వేసుకుని నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. రాజధాని రైతులు తుళ్ళూరులో చేస్తున్న ధర్నాకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది.

Also Read:Capital Crisis : రాజధాని మార్పుతో... మనస్తాపంతో మృతిచెందిన రైతు..

అయితే గ్రామస్తులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా టెంటుల్లోనే కూర్చుని ధర్నా చేశారు. ధర్నాలో నిరసనకారులు కొందరు సీఎం జగన్ ను ఇమిటేట్ చేస్తూ అధికారులను ఉద్దేశించి స్పీచులిచ్చారు. అయ్యా..అధికారులూ అంటూ వైఎస్సార్, జగన్ స్టైల్లో మాట్లాడారు. 

click me!