నటుడు,ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అమరావతిలో జరుగుతున్న నిరసనలపై తీవ్ర విమర్శలు చేశారు.అమరావతిలో రైతుల పేరుతో ఆందోళనలు చేస్తున్నది పెయిడ్ ఆర్టిస్టులేనన్నారు. వారు రైతులైతే ఆడి కార్లు, బంగారు గాజులు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు.
ఏపీని రాజధాని అంశం కుదేపేస్తోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని అమరావతి రైతులు,టిడిపి డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వానికి ఃవ్యతిరేకంగా అమరావతిలో నిరపనలు కొనసాగుతున్నాయి. అలాగే టీడిపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇదే రీతిలో అధికార పార్టీ నేతలు కూడా టీడీపీ నేతలకు ధీటుగా సమాధానమిస్తున్నారు.
తాజాగా అమరావతిలో జరుగుతున్న నిరసనలపై నటుడు,ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ స్పందించారు. అమరావతిలో ఆందోళనలో పాల్గోంటున్న వారందరూ పెయిడ్ ఆర్టిస్టులేనని విమర్శించారు. వారు నిజమైన రైతులైతే ఆడి కార్లు,మహిళల చేతులకు బంగారు గాజులు ఎలావచ్చాయంటూ ప్రశ్నించారు. అక్కడ నిరసనలు రైతులు చేస్తునంటుగా లేదని కార్పోరేట్ శక్తులు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయన్నారు. అక్కడి పరిణామాలు అన్నింటిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. ఇవన్ని పవణ్ కళ్యాణ్‌కు కనిపించడం లేదంటూ విమర్శించారు.
undefined
ఇంకా ఎన్ని రోజులు ఇలా.. మమ్మల్ని పట్టించుకోరా
ఇదిలా ఉండగా అమరావతి అంశం రాజకీయంగా ఏపీలో తీవ్ర దూమారాన్పి రేపుతుంది. అధికార,విపక్ష నేతల మధ్య మాటల యుధ్థం కొనసాగుతోంది.ఏపీకి మూడు రాజధానులు అంటూ వైసీపీ నేతలు అంటుంటే .. కాదు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని టీడీపీ డిమాండ్ చెస్తోంది. అమరావతి ఆందోళనలన్నీ బోగస్ అని,అవన్నీ టీడీపీ అద్వర్యంలో జరుగుతోన్న ఆందోళనలని వైసీపీ నేతలు విమర్శిస్తుంటే.. అక్కడ ఆందోళనలు చేస్తోంది ఎవరో ఈ గుడ్డి ప్రభుత్వానికి కనిపించడం లేదంటూ టీడీపీ విమర్శిస్తోంది.
ఏపి రాజధాని వివాదం... జగన్ తల్లీ, చెల్లిని కూడా వదలని టిడిపి
ఇది ఇలా ఉంటే అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. రైతుల నిరసనలు చేపట్టి నేటికి 19వ రోజులు అవుతోంది. రాజధానిని అమరావతిలోనే కోనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటుంది. ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రాజధాని రైతుల ఐకాస ప్రకటించింది. వారికి పలు రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల నుంచి మద్దతు లభిస్తోంది.