వైసిపి ఎమ్మెల్యేలపై దాడి టీడీపీ గూండాల పనే : పుష్ప శ్రీవాణి

By Arun Kumar PFirst Published Jan 7, 2020, 10:12 PM IST
Highlights

వైసిపి ఎమ్మెల్యేలపై  దాడికి పాల్పడింది టిడిపి గూండాల పనేనని... చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ దాడులు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆరోపించారు.

అమరావతి: ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పై రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ గూండాలు దాడికి పాల్పడటాన్ని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు చేయించినందుకు టీడీపీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. రైతుల ఉద్యమం పేరుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని పుష్ప శ్రీవాణి ఆరోపించారు. 

మంగళవారం గుంటూరు జిల్లాలో టోల్ గేట్ వద్ద విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై జరిగిన దాడే ఉదాహరణ అని పేర్కొన్నారు. రైతులు 20 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా ఏ రోజు అక్కడ ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఒక్కరిపైన కూడా ఎలాంటి చర్యలకు పూనుకోలేదన్నారు. పైగా రైతుల ఆందోళనలకు పోలీసుల భద్రతను కూడా కల్పించడం జరిగిందని గుర్తు చేసారు.

read more  అమరావతికి 1156మంది మద్దతు... మరి విశాఖకు...: టిడిపి ఎంపీ కనకమేడల వెల్లడి

నిజమైన రైతులు ఎవ్వరు కూడాఇలా రాళ్లు, కర్రలతో దాడులకు దిగరని ఇది ముమ్మాటికీ చంద్రబాబు నాయుడు పార్టీ గూండాలు చేత చేయించిన దాడిగానే భావిస్తున్నానని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. రైతులు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ కుట్రలు అర్థం చేసుకోవాలని హితవు చెప్పారు. 

చంద్రబాబుని, టీడీపీ నాయకులను రైతులు దగ్గరకు రానివ్వకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు వైఖరితో రైతుల పోరాటానికి కూడా విలువ లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు. రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. 

read more  మాజీ మంత్రి అయ్యన్నపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి: వైసిపి ఎమ్మెల్యే డిమాండ్

టీడీపీ నేతలు రౌడీ రాజకీయాలను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేసారు. తోట్ల వల్లూరులో కూడా దళిత ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడాన్ని కూడా ఖండిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలేంటో ఇప్పుడు ప్రజలకు అర్థమైయ్యాయని.  దీనికి తగిన మూల్యం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ చెల్లించక తప్పదని పుష్పశ్రీవాణి హెచ్చరించారు.


 

     
 

click me!