అమరావతికి 1156మంది మద్దతు... మరి విశాఖకు...: టిడిపి ఎంపీ కనకమేడల వెల్లడి

By Arun Kumar P  |  First Published Jan 7, 2020, 9:51 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రజాభీష్టం మేరకే ఏర్పడిందని... అక్కడి  నుండి దాన్ని తరలించడం ఎవరితరం కాదని టిడిపి ఎంపీ కనకమేడల పేర్కొన్నారు. 


ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాజధానిపై కొత్త సమస్యను సృష్టించిందని టీడీపీ రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు.  ఓ వైపు ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే మరో వైపు ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాప చేస్తోందన్నారు.ప్రజా నిర్ణయాన్ని అనుసరించి అమరావతిలోనే పూర్తిస్ధాయి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 

మంగళవారం మంగళగిరిలోని జాతీయ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 16 ప్రకారం రాజధాని ఏర్పాటుపై గతంలోనే కేంద్రం నిపుణలతో శివరామకృష్ణన్‌ కమిటిని నియమించినట్లు తెలిపారు. ఆ నివేదిక అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రాజదానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చట్టంలో ఉందన్నారు.

Latest Videos

శివరామకృష్ణ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నివేదికను ఇచ్చిందన్నారు. ఈ కమిటీ రాజధానిపై 4,728 మంది ప్రజల అభిప్రాయాలు సేకరించగా... విజయవాడ, గుంటూరు మద్య రాజధాని ఉండాలంటూ 1156 మంది, విజయవాడకు  663 మంది,  గుంటూరుకు 372 మంది, విశాఖకు 507 మంది, కర్నూలుకు 365, ఒంగోలులో 260, దొనకొండకు అనుకూలంగా 116 మంది తమ అభిప్రాయాలు వెలిబుచ్చారని తెలిపారు.

read more  మేమూ అలాగే చేస్తే చంద్రబాబు, లోకేశ్ లు తట్టుకోలేరు: మంత్రి అనిల్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకుని నాటి టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని అసెంబ్లీలో ప్రకటించిందన్నారు. ఆ సమయంలో అమరావతిలోనే రాజధాని నిర్మించాలని, 30 వేల ఎకరాలకు తక్కువ కాకుండా రాజదాని నిర్మాణం జరగాలని జగన్‌ కూడా చెప్పారన్నారు. కానీ నేడు మాట తప్పి మడమ తిప్పిన జగన్‌ రాష్ట్ర ప్రజలతో రాక్షస క్రీడ ఆడుకుంటున్నారని ఆరోపించారు.

అమరావతిలో సచివాలయం, పరిపాలన కార్యాలయాలు, అసెంబ్లీ, శాసనమండలి ఉన్నాయన్నారు. డిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తామంటేనే సింగపూర్‌ తరహా మన రాజధాని నరగాన్ని అభివృద్ది చేసేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారు.  రాజధానిలో 9 నవ నగర నిర్మాణాలకు ప్లాన్‌ రూపొందించి తొందరంగా నిర్మించేందకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

కేంద్రం రాజధానికి రూ. 1500 కోట్లు, విజయవాడ, గుంటూరు డ్రైనీజీ పనుల కోసం మరో రూ. 1000 కోట్లు ఇచ్చిందన్నారు. భూములిచ్చిన రైతులకు  ప్లాట్లు ఇవ్వటం కూడా జరిగిందని... దానికి సీర్డీయేతో చట్టబద్దత కల్పించటం జరిగిందన్నారు. ఏపి సీర్డీయే చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ల్యాండ్‌పూలింగ్‌ ప్రకారం రైతులతో అగ్రిమెంట్‌ చేసుకుందన్నారు.

read more   ఆ వెధవ పని చేసింది చంద్రబాబే... రాజధానిపై ఉద్యోగ సంఘం నేత కీలక వ్యాఖ్యలు

ఒక ప్రభుత్వం అమలుచేసిన వాటిని మరొక ప్రభుత్వం అమలు చేయదా? అని ప్రశ్నించారు  దీన్ని ఉల్లఘించటానికి ప్రభుత్వానికి హక్కులేదన్నారు. వైసీపీ ప్రభుతం కక్షపూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు 3 రాజధానుల ప్రకటన చేసిందని మండిపడ్డారు. 

అంతకంటే ముందే రాజధానిలో అవకతలు జరిగాయని కేట్‌నెట్‌ కమిటీ వేసి జగన్‌ నివేదిక తెప్పించుకున్నారని... తర్వాత  పీటర్‌ కమిటీ వేశారన్నారు. ఆ తర్వాత మళ్లీ జీఎన్‌రావు కమటీ వేశారని... ఆ నివేదిక రాకుండానే 3 రాజధానులుండొచ్చు అంటూ జగన్‌ అసెంబ్లీలో ప్రకటించారని గుర్తుచేశారు. జగన్‌ వ్యాఖ్యలకు అనుగుణంగానే  ఆ కమిటీ నివేదిక ఇచ్చిందని... బోస్టన్‌ కమిటీ కూడా అదే దొంగ రిపోర్టు ఇచ్చిందన్నారు. 

ఇప్పడు మళ్లీ హైపవర్‌ కమిటీ అంటూ  మంత్రులతో మరో కమిటీ వేశారని...అసలు ఈ కమిటీలు వేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది అని నిలదీశారు. 2014 పునర్‌ వ్యవస్తీకరణ చట్ట ప్రకారం కమిటీవేసే అధికారం, రాజదాని మార్చే అధికారం లేదన్నారు. చట్టంలోని సెక్షన్‌ 31 ప్రకారం ఏర్పాటు చేసిన హైకోర్టును మార్చే అధికారం ఎవరీకీ లేదన్నారు.

సుప్రీం కోర్టు, ఆర్డర్‌, రాష్ట్రపతి గెజిట్‌ నోటిపికేషన్‌తో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకుందన్నారు. ఇలాంటి విధానాలు మానుకుని ఇప్పటికైనా ప్రభుత్వం  రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి.. లేకపోతే ప్రజాగహ్రానికి గురి కాక తప్పదని రవీంద్రకుమార్‌ హెచ్చరించారు.

click me!