చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమ పేరుతో వంచన....గర్భవతిని చేసి చివరకు

Arun Kumar P   | Asianet News
Published : Jan 07, 2020, 09:02 PM IST
చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమ పేరుతో వంచన....గర్భవతిని చేసి చివరకు

సారాంశం

ప్రేమ పేరుతో యువతిని వంచించి గర్భవతిని చేసిన ఓ మృగాడిని తుళ్లూరు పోలీసులు కటకటాలవెెనక్కి తోశారు. 

గుంటూరు: భర్తకు దూరమైన ఓ యువతిపై కన్నేసి ప్రేమ పేరుతో ఆమెను వంచించిన ఘటన గుంటూరు జిల్లా తూళ్లూరులో చోటుచేసుకుంది. శారీరకంగా వాడుకుని తీరా యువతి గర్భవతి కాగానే వదిలించుకోడానికి ప్రయత్నించిన ఓ మృగాడు కటకటాలపాలయ్యాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తుళ్లూరుకు చెందిన రూపావత్ కిషోర్ నాయక్  తన చిన్ననాటి స్నేహితురాలికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లయి భర్తకు దూరంగా వుంటున్న యువతికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడు.  పెళ్ళిచేసుకుని మంచి జీవితాన్ని అందిస్తానని స్నేహితురాలిని నమ్మించి కామ వాంఛ తీర్చుకున్నాడు. 

అయితే ఇటీవల సదరు యువతికి ఒంట్లో బాగోలేకపోవడంతో హాస్పిటల్లో చూయించగా గర్భం దాల్చినట్లు తేలింది. దీంతో పెళ్ళి చేసుకోవాల్సిందిగా ప్రియున్ని నిలదీయగా వదిలించుకోడానికి ప్రయత్నించాడు. దీంతో  మోసపోయానని గ్రహించిన యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది.  

తనను ప్రేమిస్తున్నానని ఇన్నాళ్లు నమ్మించిన కిషోర్ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరితే బెదిరింపులకు దిగుతున్నాడని ఫిర్యాదులో పేర్కోంది. ఈ విషయం బయట చెబితే చంపుతానని బెదిరించినట్లు తెలిపింది. తనకు ఎలాగయినా న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను కోరింది.

దీంతో ఆమె ఫిర్యాదుపపై వెంటనే స్పందించిన తుళ్లూరు పోలీసులు రూపావత్ కిషోర్ నాయక్ ని అరెస్ట్ చేసి సెక్షన్ 376(2)(n),417,506 క్రింద కేసు నమోదు చేశారు.  అతన్ని కోర్టులో హాజరు పరచిన రిమాండ్ కు తరలించినట్లు సీఐ శ్రీహరి రావు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా