జగన్ కూడా కిరణ్ కుమార్ రెడ్డిలా చేయాల్సింది: చంద్రబాబుతో భేటీ తర్వాత సిపిఐ రామకృష్ణ

By Arun Kumar PFirst Published Mar 5, 2020, 9:24 PM IST
Highlights

స్థానిక సంస్ధల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ తగ్గించడంపై మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబుతో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ చర్చించారు.  

గుంటూరు: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి వైసీపీ ప్రభుత్వం వారికి చేస్తున్న అన్యాయం, పంచాయతీ రాజ్ చట్ట సవరణతో ప్రత్యర్ధి పార్టీల అభ్యర్దులను భ్రయబ్రాంతులకు గురిచేయటం వంటి అంశాలపై టీడీపీ రాష్ర్ట అధ్యక్షులు కళా వెంకట్రావు, సీపీఐ రాష్ర్ట అధ్యక్షులు కె రామకృష్ణ,  ముప్పాళ్ల నాగేశ్వరరావు, హరినాథరెడ్డిలు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో చర్చించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో వీరు చంద్రబాబును కలిశారు. 

అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు.  మొదట  కళా వెంకట్రావు మాట్లాడుతూ... బీసీ రిజర్వరేషన్లపై ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించడం లేదని... కోర్టులో  దీనిపై వాదించేందుకు సమర్దవంతమైన అడ్వకేట్లను పెట్టలేదన్నారు. అలాగే ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులతో పోలీసు వ్యవస్ధను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. 

పంచాయితీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ తో  టీడీపీకి చెందిన  బలమైన అభ్యర్దులను భయపెట్టి స్ధానిక సంస్ధలను హస్తగతం చేసుకోవాలని వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. గెలిచినా పదవులు రద్దు చేస్తామని చట్టంలో పెట్టడం జగన్ దుర్నీతికి నిదర్శనమని మండిపడ్డారు. బీసీలకు 9.5 శాతం రిజర్వేషన్లు తగ్గించడం వల్ల వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు వేలాది పదవులు వారు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

read more   తెలంగాణ పోలీసులతో... టిడిపి ఫిర్యాదుపై స్పందించిన ఏపి ఎన్నికల కమీషనర్

టీడీపీ 1987 లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించటం వల్ల అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు. అలా గత 37 ఏళ్లుగా వివిధ పదవుల్లో రాణిస్తున్నారని అన్నారు. కానీ  ఇప్పుడు జగన్ కుతంత్రం వల్ల బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని... కొత్తగా పంచాయితీరాజ్  చట్ట సవరణ నెపంతో టీడీపీ అభ్యర్దులపై ఏదో ఒక అభియోగం మోపి అక్రమ  కేసుల్లో ఇరికించ ఆ స్ధానాల్ని  హస్తగతం చేసుకోవాలని సీఎంజగన్ పన్నాగం పన్నారని ఆరోపించారు. 

సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ...బీసీ రిజర్వేషన్లపై సీఎం జగన్ సరైన రీతిలో స్పందించలేదన్నారు. గత సీఎం చంద్రబాబు మాదిరిగా చొరవ చూపడం లేదన్నారు.  అందరి అభిప్రాయాలు తీసుకొని సుప్రీం కోర్టుకు వెళితే బావుండేదని.. కానీ అలా చేయలేదని అన్నారు. 

ఎన్నికల్లో గెలిపించే బాధ్యత మీదే అంటూ మంత్రులకు వార్నింగ్ ఇవ్వటం జగన్ నైజాన్ని తెలియజేస్తోందన్నారు.  స్ధానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గడం వల్ల బీసీలు 4 జడ్పీ చైర్మన్లలో ఒకటి, 65 జడ్పీటీసీలు, 65 ఎంపీపీలు, వేల సంఖ్యలో ఇతర స్ధానిక సంస్ధల పదవులను కోల్పోనున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో   జగన్ నిర్లక్యంగా వ్యవహరించారని.. అందువల్లే ఈ పరిస్థతి ఏర్పడిందని మండిపడ్డారు. 

read more   ఆ ఉద్యోగులను స్థానికసంస్థల ఎన్నికలకు దూరంగా వుంచండి...: సీఈసీకి టిడిపి ఫిర్యాదు

గతంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై  కిరణ్  కుమార్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి సుప్రిం కోర్టుకు వెళ్లారని గుర్తుచేశారు. కానీ ఇప్పడు జగన్ అఖిలపక్షం ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని ప్రశ్నించారు. అమరావతి నుంచి రాజధానిని  తరలించేందుకు రూ.5 కోట్లు పెట్టి లాయర్ ని నియమించిన జగన్ బీసీ రిజర్వేషన్లపై ఆ విధంగా ఎందుకు వ్యవహరించలేదని నిలదీశారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తోందని ఆరోపించారు. 

ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపణి చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష అని జగన్ చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వుందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గెలవలేదా? అని ప్రశ్నించారు. డబ్బు పంచటాన్ని మేం ప్రోత్సహించటం లేదు...  కానీ కేవలం ఈ నెపంతో ప్రత్యర్ధి పార్టీల అభ్యర్డులను భయబ్రాంతులకు గురి చేసి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో చర్చ జరగాలని రామకృష్ణ కోరారు.  
 

click me!