అది ముమ్మాటికీ జగన్ చేసిన హత్యే... కేవలం అందుకోసమే: వంగలపూడి అనిత

By Arun Kumar P  |  First Published Mar 5, 2020, 6:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన ఆరోపణలు చేశారు. 


గుంటూరు: ఇళ్ళస్థలాల పంపిణీ పేరిట జగన్ ప్రభుత్వం నిరుపేద రైతుల పొట్టకొట్టడానికి సిద్దమైందని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న రైతుల భూములను కూడా ఇళ్లస్థలాల పేరిట ప్రభుత్వం లాక్కుంటోందని మండిపడ్డారు. ఇలా భూమిని కోల్పోయిన ఓ మహిళా రైతు కర్నూల్ జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరులో మృతిచెందినట్లు పేర్కొంటూ అనిత ఆవేదన వ్యక్తం చేశారు.  

''పేద‌ల‌భూమిని పంచే పెద్ద‌లు జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి గారూ!  భూల‌క్ష్మి భూమిని లాక్కున్నారు. భూమేలేని లోకం ఎందుక‌ని భూల‌క్ష్మి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఆమె స‌మాధిపై జ‌గ‌న‌న్న‌-వైఎస్సార్ ఇళ్ల‌కాల‌నీ పునాది వేయండి.'' 
 
''జ‌గ‌న్ స‌ర్కారు దౌర్జ‌న్యాన్ని ఎదిరించి ఓడిపోయి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.  ఇది ఆత్మ‌హ‌త్య కానే కాదు. ముమ్మాటికీ జ‌గ‌న్ త‌న పేరుకోసం చేసిన హ‌త్య‌'' అని ట్విట్టర్ వేదికన ముఖ్యమంత్రి జగన్ పై సంచనల ఆరోపణలు చేశారు వంగలపూడి అనిత. 

Latest Videos

undefined

read more  ముప్పై మందితో మొదలై 16వేలకు... వారిపై ఎందుకంత కక్ష: సీఎంను నిలదీసిన మాాజీ మంత్రి

ఉగాదిరోజున అర్హులైన పేదలందరికి ఇళ్లపట్టాలను అందించి తీరాలన్న కృతనిశ్చయంతో ఏపి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్ల గురించి తెలుసుకునేందుకు పలుమార్లు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.

నిరుపేదలకు ఇళ్లపట్టాలను అందించడం కోసం భూముల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లాల వారీగా ఉన్నతాధికారులు పర్యటించి సమీక్ష చేయాలన్నారు. కింది స్థాయిలో అధికారులులక్ష్యాలను చేరుకున్నారా...లేదా? అన్నదానిపై సమగ్ర వివరాలు సేకరించాలని సూచించారు.  ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు సీఎం సూచించారు. 

ప్రతి జిల్లాలో కనీసం రెండుసార్లు సమీక్షలు చేయాలన్నారు. ప్లాట్ల మార్కింగ్‌ జరుగుతుందా... లేదా? ఇళ్లపట్టాలకోసం గుర్తించిన భూములను సిద్ధం చేస్తున్నారా.. లేదా? అన్నదానిపై సమీక్ష చేయాలన్నారు. ఉగాది నాటికి ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమం సాఫీగా సాగడానికి అవసరమైతే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

ఇలా ప్రభుత్వం నుండి తీవ్ర ఒత్తిడి పెరుగుతుండటంతో అసైన్డ్ భూములను సాగు చేస్తున్న రైతుల నుండి అధికారులు బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ప్రతిపక్ష టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమిని బతవంతంగా లాక్కోవడం వల్ల భూలక్ష్మి అనే మహిళా రైతు ఆత్మహత్య చేసుకుందని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. 

 


 

 

click me!