సీఎం జగన్ డిల్లీ పర్యటనపై విమర్శలు గుప్పించిన పవర్ కల్యాణ్ పై వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. జనసేన పార్టీ పుట్టిందే టిడిపి కోసమని ఆయన ఆరోపించారు.
విజయవాడ: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరడానికే సీఎం జగన్మోహన్ రెడ్డి డిల్లీకి వెళ్లినట్లు వెఎస్సార్‌సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడించారు. అందుకోసమే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిసినట్లు తెలిపారు. రివర్స్ టెండరింగ్ గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా వివరించారని...ఈ నిర్ణయాన్ని ఆయన కూడా అభినందించినట్లు అంబటి వెల్లడించారు.
రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం సీఎంగా జగన్ బాధ్యత అని గుర్తుచేశారు. ఇందుకోసం డిల్లీకి వెళ్ళిన .జగన్ పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు విమర్శించడాన్ని తప్పుబట్టారు. పవన్ అయితే మరింత బరితెగించి సీఎంను విమర్శించాడని అంబటి ఫైర్ అయ్యారు.
జగన్ పై ఇంకా కేసులు విచారణ జరుగుతుంటే నేరస్తుడు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆయన కేవలం నేరారోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారు తప్ప నేరస్తులు కాదన్నారు. వేల పుస్తకాలు చదివానంటున్న పవన్ కు ఈ సంగతి తెలియదా.. అని ప్రశ్నించారు.
read more ఏపి అభివృద్దికి సహకరిస్తాం...: కేంద్ర మంత్రి సదానందగౌడ
జగన్ ను నేరుగా ఎదుర్కోలేకే సోనియా గాంధి సహకారంతో చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారని ఆరోపించారు. చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకునే చంద్రబాబు ఈ పని చేయించారన్నారు. సీబీఐ కేసులతో జగన్ ను భయపెట్టాలని చూశారని... 16 నెలలు జైల్లో అన్యాయంగా పెట్టారన్నారు.
ఒక పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి మద్దతుగా జనసేన పార్టీని పవన్ పెట్టారని ఆరోపించారు. జగన్ పై హత్యాయత్నం జరిగింది నిజమా కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు డీఎన్ఏ పవన్ కళ్యాణ్ డీఎన్ఏ ఒకటే కాబట్టి ఇద్దరు ఒకేలా మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు.
read more లోకేశ్ మగాడు...జగన్ మగాడో కాదో నువ్వే తేల్చాలి...: బుద్దా వెంకన్న ఫైర్
ప్రకాశం జిల్లాలో వలసలు సంగతి పక్కన పెట్టి పవన్ తన సొంత పార్టీలో వలసలు అపుకోవాలన్నారు. ఎవరికోసమే రాజకీయాలు చెయొద్దని సూచించారు. రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో ముందు తెలుసుకోవాలని సూచించారు. అసలు జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కే పవన్ కు లేదన్నారు.
చంద్రబాబు ఉదయం మాట్లాడిందే సాయింత్రం పవన్ మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చోట ఇప్పటి వరకు పవన్ కనీసం మొహం చూపించలేదని విమర్శించారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ అని అంబటి ఘాటుగా విమర్శించారు.
కుప్పం మంగళగిరిలో చంద్రబాబు, లోకేష్ పై ఎందుకు పోటీ పెట్టకపోవడమే పవన్ లాలూచీ రాజకీయాల గురించి తెలియజేస్తుందన్నారు.చంద్రబాబును నమ్ముకొని పవన్ రాజకీయాలు చేస్తే ప్రజలే తిరస్కరిస్తారని... సొంతగా రాజకీయాలు చేస్తే నాలుగు సీట్లు అయిన వస్తాయన్నారు. గతంలో పోటీ చేయకుండా చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్న పవన్ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.