భార్యాభర్తల గొడవలో తలదూర్చి... రాళ్లతో కొట్టి, లారీకిందకు తోసి దారుణ హత్య

By Arun Kumar P  |  First Published Oct 8, 2020, 8:52 AM IST

తన బంధువుపై జాలిపడి కాపాడిన పాపానికి ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. 


గుంటూరు: గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంతో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. తన బంధువుపై జాలిపడి కాపాడిన పాపానికి ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల ఏడుకొండలు మద్యం సేవించి వచ్చి భార్యతో దుర్భాషలాడుతుండగా పక్కింట్లో వుండే ముజావర్ సైదా అడ్డుకున్నాడు. ఇలా అడ్డుకున్న వారిని కూడా తీవ్ర పదజాలంతో దూషించడంతో కోపోద్రిక్తులయిన వారు ఏడుకొండలును ఓ స్తంబానికి కట్టేసి చితకబాదారు. 

Latest Videos

అయితే వారిని అదే గ్రామానికి చెందిన ఏడుకొండలు బంధువు తిరుపతి అడ్డుకున్నాడు. ఇలా వారి బారినుండి ఏడుకొండలును కాపాడి తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు. గ్రామంలో గొడవ జరుగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరేలోపై నిందితులంతా అరక్కడినుండి పరారయ్యారు. 

read more   జైల్లోనే...హేమంత్ హత్యకేసులో నిందితుడికి కరోనా

పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది తిరుపతే అని భావించిన సైదా తన బంధువులతో కలిసి అతడిపై దాడికి పాల్పడ్డాడు. అదే రాత్రి ఏడుకొండలుపై రాళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చడమే కాకుండా వేగంగా వెళుతున్న లారీ కిందకు తోసి హత్య చేశారు. 

ఈ హత్యతో గ్రామంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకురాగా తమకు న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశామని... వారిని కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు వారికి సర్దిచెప్పి అంత్యక్రియలకు వారిని ఒప్పించారు. 
 

click me!