అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై అమరావతి దళిత జెఎసి నాయకులు తీవ్రంగా స్పందించారు.
రాజదానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై అమరావతి దళిత జెఎసి నాయకులు తీవ్రంగా స్పందించారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలోని కృష్ణా నది పుష్కర ఘాట్ లో మంత్రి బొత్స కు పిండ ప్రదానం చేశారు.
అనంతరం దళిత నాయకుడు చిలక బసవయ్య మాట్లాడుతూ... అమరావతి పై మంత్రి బొత్స సత్యనారాయణ విషం చిమ్ముతున్నారని అన్నారు. దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా బొత్స వ్యాఖ్యలు చేస్తున్నారని... మంత్రి మాట్లాడే ప్రతి ఒక్క మాట నిరూపించలేని మాటలన్నారు. రాజధాని అమరావతిలో ఏ ఒక్క దళితుడికి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేయకపోయినా దళితులకు అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు.
వీడియో
పదహారు నెలల క్రితం వేసిన సిట్ విచారణ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు అసైన్డ్ రైతులకు కౌలు పరిహారం చెల్లించలేదని... వారి కుటుంబాలు ఏ విధంగా బతకాలని ప్రశ్నించారు. అమరావతిలో అసైన్డ్ భూములు కూడా సమాన ప్యాకేజీ ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారని అన్నారు. భూమి లేని నిరుపేదలకు 5000 ఇస్తామన్నారని.. ముందు ఆ హామీలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.