విశాఖ మానసిక ఆస్పత్రికి.. అక్క కొడుకును చంపి, పేగులు మెడలో వేసుకున్న పిన్ని...

By AN Telugu  |  First Published Oct 6, 2020, 12:55 PM IST

చిలకలూరి పేటలో సొంత అక్క కొడుకునే కత్తితో కడుపుచీల్చి పేగులు బైటికి తీసిన దారుణ సంఘటనలో నిందితురాలు ఆషాను విశాఖ ఆస్పత్రికి తరలించాడు.  చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఆదివారం నాడు జరిగిన ఈ ఘటన స్థానికంగా భయప్రకంపనలు సృష్టించింది. అయితే సంఘటన జరిగి 36 గంటలు గడిచినా నిందితురాలు ఆషా ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. ఆమెను విశాఖలోని ప్రభుత్వ మానసిక సంరక్షణ వైద్యశాలకు తరలించారు. 


చిలకలూరి పేటలో సొంత అక్క కొడుకునే కత్తితో కడుపుచీల్చి పేగులు బైటికి తీసిన దారుణ సంఘటనలో నిందితురాలు ఆషాను విశాఖ ఆస్పత్రికి తరలించాడు.  చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఆదివారం నాడు జరిగిన ఈ ఘటన స్థానికంగా భయప్రకంపనలు సృష్టించింది. అయితే సంఘటన జరిగి 36 గంటలు గడిచినా నిందితురాలు ఆషా ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. ఆమెను విశాఖలోని ప్రభుత్వ మానసిక సంరక్షణ వైద్యశాలకు తరలించారు. 

అంతకు ముందు జిల్లా ఆస్పత్రిలోని వైద్యులు ప్రాథమికంగా ఆమె మానసిక పరిస్థితికి సంబంధించి కొన్ని పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల ఆధారంగా ఆషాకు నరాలకు సంబంధించిన కొన్ని బలహీనతలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే మానసిక ఒత్తిడి పెరిగి విచక్షణ కోల్పోవడం వల్లే దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చని అంటున్నారు. ఇదే విషయాలను సోమవారం చిలకలూరిపేట కోర్టులో న్యాయమూర్తికి పోలీసులు తెలిపారు. కేసు వివరాలను పరిశీలించిన కోర్టు ఆషాను వైజాగ్‌లోని ప్రభుత్వ మానసిక సంరక్షణ వైద్యశాలకు తరలించి మరిన్ని పరీక్షలు చేయించాలని  ఆదేశించింది. దీంతో ఆమెను సోమవారం రాత్రి పోలీసులు వైద్యుల సాయంతో వైజాగ్‌కు తరలించారు. 

Latest Videos

చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఆదివారంనాడు  ఓ యువతి సైకోలా మారి, అక్క కొడుకును దారుణంగా హతమార్చింది. చాకుతో శరీర భాగాలను కోసి పేగులను మెడలో వేసుకుని రక్తం రుచి చూడడం గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసిన విషయం తెలిసిందే.   గ్రామంలోని అద్దెకుంటున్నారు షేక్‌ సలాం, ఆషా దంపతులు. వీరికి ఆబిద్, షమ్రి ఇద్దరు సంతానం. నరసరావుపేటలో ఉంటున్న ఆషా అక్క ఫాతిమా భర్తతో గొడవపడి తన పిల్లలు కరిమున్, కరిముల్లా, ఖాజాతో కలిసి చెల్లెలి ఇంటికి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున ఫాతిమా, ఆమె తల్లి ఖాదర్‌బీ, చిన్న అల్లుడు సలాం కలిసి పనిమీద బాపట్లకు వెళ్లారు. 

మధ్యాహ్నం పిల్లలు ఆడుకుంటున్న సమయంలో అక్క కొడుకు కరిముల్లా అల్లరి చేశాడని ఆషా చీపురు కట్టతో కొట్టింది. అంతటితో ఆగక పట్టరాని కోపంతో వంటింట్లో నుంచి చాకు తీసుకొచ్చి బాలుడి చేతిని గాయపరిచింది. భీతిల్లిన కరిముల్లా కాపాడండంటూ పెద్దగా కేకలు వేశాడు. అక్కడే ఆడుకుంటున్న కరిముల్లా సోదరి కరీమున్‌ ప్రాణభయంతో తనతోపాటు మిగిలిన ముగ్గురు పిల్లలను ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపు గడియ బిగించింది. కేకలు విన్న ఇంటి యజమాని భార్య మెట్లెక్కి పైకి రావడాన్ని గమనించిన ఆషా.. చాకును చూపించి చంపేస్తానంటూ బెదిరించడంతో ఆమె భయంతో కిందికి వచ్చి భర్తకు చెప్పింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఈలోగా ఇరుగుపొరుగును పిలిచి ఘటనాస్థలికి వెళ్లేసరికి బాబు గొంతును కోసి అక్కడి నుంచి పొత్తి కడుపు వరకు పూర్తిస్థాయిలో కోసి పేగుల్ని బయటకు తీయడాన్ని చూసి జనంలో వణుకు మొదలైంది. ఈలోగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆశా వద్ద ఉన్న చాకును అతి కష్టం మీద లాక్కుని ఆమెను ఇంటి బయటికి తీసుకురావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. 

చిలకలూరిపేట రూరల్‌ సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎ.భాస్కర్‌ ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గ్రహించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంటి గడియ తీసి లోపల కన్నీరు కారుస్తూ బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో ఉన్న నలుగురు పిల్లలను సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తకు అప్పగించారు. బాలుడి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

click me!