ఆయనేం సృష్టికర్త కాదు... అనుకుంటాడు అంతే..: యనమలపై బొత్స సెటైర్లు

By Arun Kumar P  |  First Published Feb 4, 2020, 4:01 PM IST

మాజీ ఆర్థిక మంత్రి, టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృషణుడిపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. తాను మహా మేధావిని అన్నట్లుగా యనమల మాట్లాడతారని విమర్శించారు. 


అమరావతి: మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్ని విషయాలు తనకే తెలుసని... తనకంటే మేధావి ఎవరూ లేరన్నట్లుగా ఫీలవుతారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సృష్టికర్త బ్రహ్మదేవుడి తర్వాత తాను మరో బ్రహ్మనని ఫీలవుతుంటాడని ఎద్దేవా చేశారు. ప్రతి విషయం తనకే తెలుసంటూ పెద్ద మేధావిలా మాట్లాడతాడు... కానీ ఆయనకు తెలియని విషయాలు చాలా వున్నాయని గుర్తించాలని బొత్స సూచించారు. 

వికేంద్రీకరణ బిల్లు విషయంలో శాసనమండలి సెక్రటరీ పై వైసిపి మంత్రులు ఒత్తిడి తెస్తున్నారంటూ యనమల తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయినా సెక్రటరీపై ఒత్తిడి తేవాల్సిన అవసరం తమకు లేదని... రాజ్యాంగానికి లోబడే ఆయన నిర్ణయాలు ఉండాలని తాము కోరుకుంటున్నట్లు బొత్స తెలిపారు. 

Latest Videos

undefined

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును మండలిలో ఈ విధంగా అడ్డుకోవడం అన్నది తన రాజకీయ జీవితంలో మొదటిసారి చూస్తున్నానని అన్నారు. అధికార పక్షం రూల్ ప్రకారం వెల్లమంటే ప్రతిపక్షమే మండలి చైర్మన్ పై ఒత్తిడి తెచ్చిందన్నారు. మండలి చైర్మన్ టీడీపీకి చెందినవారు అయినప్పటికి రాజ్యాంగబద్దబమైన శాసన మండలి చైర్మన్ పదవిలో ఉన్నారని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. 

read more  జగన్ కి షాక్... దిశ బిల్లును వెనక్కి పంపిన కేంద్రం

కేవలం మండలి ఛైర్మన్ కే కాదు ప్రభుత్వానికి కూడా విచక్షణాధికారాలు ఉంటాయని తెలుసుకుని టిడిపి నాయకులు మాట్లాడాలని సూచించారు. యనమల ఇష్టానుసారం మాట్లాడితే కుదరదని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వానికి ఉండే విచక్షణ అధికారాల ప్రకారమే ముందుకెళ్తున్నామని బొత్స పేర్కొన్నారు. 

సెలెక్ట్ కమిటీపై ఏర్పాటు మూడ్ ఆఫ్ హౌస్ అని చెప్పి ఆ తర్వాత విచక్షణ అని మాట మార్చారని అన్నారు. తప్పు చేస్తున్నానని చెప్పి మరీ మండలి ఛైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించినట్లు తెలిపారు. చంద్రబాబు కోసం ఎలాంటి పనులు చేసినా తాము మాత్రం మండలి చైర్మన్ కు గౌరవం ఇస్తున్నామని బొత్స పేర్కొన్నారు. 

ఇటీవల తాము ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను చేరవేసే కార్యక్రమాన్ని చేపడితే దానిపై కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మంచిదికాదన్నారు. తాము 7 లక్షల పెన్షన్లు తొలగించామని రాజకీయాలు చేస్తున్నారని... ప్రతిదానిపై తప్పుడు ప్రచారం చేసి లబ్ది పొందాలనేది చంద్రబాబు నైజంమని మండిపడ్డారు. తాము అర్హులను తొలగించడం కాదు కొత్తగా 6 లక్షల మందిని చేర్చామన్నారు మంత్రి బొత్స.

 

click me!