గుంటూరులో ఓ వైద్యుడిపై కొందరు దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
గుంటూరు జిల్లాలో ఓ వైద్యుడిపై దాడికి పాల్సడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ పై హత్యాయత్నానికి పాల్పడటమే కాదు బెదిరించి ఖాళీ ప్రామిసరీ నోట్ పై బలవంతంగా సంతకం చేయించుకున్నందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డిఎస్పీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పట్టుబడిని నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
అసలేం జరిగిందంటే...గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓ డాక్టర్ పై ప్రైవేట్ క్లినిక్ నడిపించుకుంటున్నాడు. అయితే ఇటీవల అతడిపై ఐదుగురు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఎలాగోలా వారి బారినుండి ప్రాణాలతో తప్పించుకున్న డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడిన మట్టారెడ్డి,సతీష్ రెడ్డి,ఫకిర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డిలను అరెస్ట్ మరోక నిందితుడు సత్తార్ సీతారామిరెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ ఐదుగురే డాక్టర్ ను చితకబాది బలవంతంగా ఖాళీ ప్రామిసరీ నోట్ పై సంతకాలు చేయించుకున్నట్లు పిడుగురాళ్ల పోలీసులు తెలిపారు. పరారీలో నిందితున్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పిడుగురాళ్ల పోలీసులు తెలిపారు.
పట్టుబడిన నలుగురు నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నామని... డాక్టర్ పై దాడికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు డిఎస్పీ వెల్లడించారు.