ఏపీకి ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారుల కేటాయింపు

By Prashanth M  |  First Published Nov 11, 2019, 5:52 PM IST

ఏపీకి కేటాయించబడిన ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారులు సోమవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ నూతన ఐపీఎస్ అధికారులకు ట్రైనింగ్ మెటీరియల్ కిట్లను అందజేసారు. 


నేషనల్ పోలీస్ అకాడమీలో 2018 బ్యాచ్ కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులను ఏపీకి కేటాయించారు. వారిలో పి.జగదీష్ (కర్ణాటక), తుషార్ దుడి (రాజస్థాన్), కృష్ణకాంత్ పాటిల్ (తెలంగాణా), వి.ఎన్.మణికంఠ చందోలు (ఆంధ్రప్రదేశ్), కృష్ణకాంత్ (ఆంధ్రప్రదేశ్) లు ఉన్నారు.  

ఏపీకి కేటాయించబడిన ఐదుగురు నూతన ఐపీఎస్ అధికారులు సోమవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ నూతన ఐపీఎస్ అధికారులకు ట్రైనింగ్ మెటీరియల్ కిట్లను అందజేసారు. రాష్ట్రంలో ఉన్న పోలీస్  ప్రత్యేక విభాగాలైన సీఐడీ,ఇంటిలిజెన్స్, ఎస్ఐబీ,అక్టోపస్, సెక్యూరిటీ వింగ్ , విజిలెన్స్, ఏసీబీ, గ్రేహౌండ్స్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిందిగా డీజీపీ ట్రైనింగ్ ఐజీపీ సంజయ్ కు ఆదేశాలు జారీ చేశారు.

Latest Videos

read also:ఏపిలో మరోసారి ఐఏఎస్ ల బదిలీలు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. తాజాగా వి.ఉషారాణిని రెవెన్యూశాఖ సెక్రటరీ, నీరబ్ కుమార్ ప్రసాద్ ను ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

కొద్దిరోజులక్రితమే  మరోసారి పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదీలలను చేపట్టింది. ఈ బదీలీల్లో భాగంగా కొంతమందికి పోస్టింగ్ ఖరారు చేయగా మరికొందరికి సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు.  ఇందులోభాగంగా జియ‌స్ఆర్‌కే విజ‌య్ కుమార్ కు మున్సిప‌ల్ శాఖ క‌మీష‌నర్ తో పాటు ప్లానింగ్ కార్య‌ద‌ర్శి, సిఈవో గా పూర్తి స్థాయి అద‌న‌పు భాద్య‌త‌లను అప్పగించారు. 

అలాగే సుమిత్ కుమార్ కు ఏపి ఫైబ‌ర్ నెట్ ఎండితో పాటు ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు, మౌళిక స‌దుపాయ‌ల కామ‌ర్స్ డిపార్ట్మెంట్ పూర్తిస్థాయి అద‌న‌పు భాద్య‌త‌లు  అప్పగించారు.అలాగే ఇసుకకు సంబంధించిన వ్యవహాల పర్యవేక్షణను కూడా ఆయనకే అప్పగించారు. 

ఎం హ‌రినారాయ‌ణ్ కు సిసిఎల్ స్పెష‌ల్ క‌మీష‌న‌ర్ తో పాటు పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ‌కు ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి గా పూర్తి స్థాయి అద‌న‌పు భాద్య‌త‌లు అప్పగించారు. అంతేకాకుండా ప్ర‌త్యేకంగా గ్రామ‌స‌చివాల‌యాలు, గ్రామ‌వాలంటీర్స్ శిక్ష‌ణ భాద్యతను కూడా  ఆయనకే అప్పగించారు. 

read more వీక్లీ ఆఫ్ మంచి నిర్ణయం...ఏపి పోలీస్ శాఖపై ప్రధాని ప్రశంసలు
 
వి. కోటేశ్వ‌ర‌మ్మను ప్లానింగ్ డిపార్ట్మెంట్ డిఫ్యూడి కార్య‌ద‌ర్శి నియమించారు. సంజ‌య్ గుప్తా ను సిసిఎస్ కార్యాల‌యంలో రిపోర్ట్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఇలా పరువురికి స్థానచలనం కల్పించడంతో పాటు అదనపు బాధ్యతలను అప్పగించారు.  

click me!