చంద్రబాబు, లోకేష్ స్పీకర్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి: వైసిపి నేత

By Prashanth M  |  First Published Nov 11, 2019, 4:56 PM IST

టీడీపీ వెబ్ సైట్ ఈ పేపర్ లో స్పీకర్  ను కించ పరుస్తూ వార్త రాశారని  బలహీన వర్గాలు అంటే ఎందుకు చంద్రబాబు లోకేష్ కి చిన్న చూపు అని తాడేపల్లి  జోగి రమేష్ వైస్సార్సీపీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుల్ని ప్రశ్నించారు. 


జోగి రమేష్ మాట్లాడుతూ.. "పేపర్ లో మీరు వాడిన భాష సభ్య సమాజం తల దించుకొనేలా ఉంది. చంద్రబాబు లోకేష్ కు అగ్ర కుల ఆహకారం ఎక్కువ.. ఆంబోతుల తింటాడు, దున్న పోతులా పడుకుంటాడు అని స్పీకర్ ను పట్టుకొని ఎలా రాస్తారు. స్పీకర్ స్థానాన్ని అవమాన పరచేలా ఎలా మాట్లాడుతారు.

ఈ పేపర్ లో స్పీకర్ ను కించ పరచే వార్తలపై చంద్రబాబు లోకేష్ పై చర్యలు తీసుకోవాలి.... చంద్రబాబు లోకేష్ స్పీకర్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి.  లేదంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి.. ఈ పేపర్ లో స్పీకర్ పై రాసిన వార్తలపై చంద్రబాబు లోకేష్ ను వదిలి పెట్టేది లేదు.

Latest Videos

స్పీకర్ పై రాసిన వార్తలపై సీఎం, గవర్నర్ ను కలిసి పిర్యాదు చేస్తాము. బలహీన వర్గాలు అంటే చంద్రబాబు ఇష్టం ఉండదు తమ్మినేనిని స్పీకర్ గా ఎన్నిక చేస్తే చంద్రబాబు దూరంగా ఉన్నారు.  బలహీన వర్గాలకు చెందిన వారు స్పీకర్ గా ఉంటే చంద్రబాబు తట్టుకోలేకపోయారు.. స్పీకర్ వ్యవస్థ ను టీడీపీ నేతలు మంట కలుపుతున్నారు. 

స్పీకర్ మీద పని కట్టుకొని విమర్శలు చేస్తున్నారు. స్పీకర్ పై ఎందుకు వ్యక్తి గతంగా విమర్శలు చేస్తున్నారో అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం సభను హుందాగా నడుపుతున్నారు. చంద్రబాబుది అగ్రకుల పార్టీ  బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్న టీడీపీ ని భూ స్థాపితం చేస్తాము" అని వివరించారు.

also read:బాబుది బిల్డప్...పవన్ ది అజ్ఞాన రాజకీయం...: వైసిపి నేత కామెంట్స్

తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తోందంటూ చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు విషప్రచారం చేస్తున్నారని వెఎస్సార్‌సిపి ఎమ్మెల్యే, రాష్ర్ట అధికార ప్రతినిధి జోగి రమేష్ ఆరోపించారు. కార్మికుల పక్షాన మాట్లాడుతున్నాం అనేందుకు వారిద్దరు తెగ బిల్డప్ ఇస్తున్నారన్నారు. కానీనిజానికి కార్మికులకు ఏం కావాలో వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు. 

తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక సమస్య త్వరలోనే పరిష్కారం అవుతోందన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ లో కోరిన వారికి ఇసుక పంపించడం జరుగుతుందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా సైతం ఇసుక కావాల్సిన వారికి అందించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కృత్రిమకొరత సృష్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని...అలా చేస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందా...? అని ప్రశ్నించారు.

రాష్ర్టంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ కూడా నిండుకుండల్లా మారాయని పేర్కొన్నారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు. ఇక కృష్ణా, గోదావరి లాంటి పెద్దనదులు సముద్రాలను తలపిస్తుని తెలిపారు. సెలయేర్లన్ని జలపాతాలను తలపిస్తున్నాయని అన్నారు. గ్రామాలలో సాగునీరు,తాగునీరు చాలా ఏళ్ల తర్వాత సమృధ్దిగా లభించాయని ప్రజలందరూ అనుకుంటున్నారని అన్నారు.    

వరదలు,వర్షాల నేపధ్యంలో అటు కృష్ణా, ఇటు గోదావరి నదిలో ప్రవాహం అధికంగా ఉండటం వల్ల ఇసుకతీయడం సాధ్యపడదనే విషయం ప్రజలు గమనిస్తున్నారని పేర్కోన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత దేవుడు కరుణించాడని... అది  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లనే జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు. 

ఈ సీజన్ లో నిర్మాణాలు కొనసాగవనే విషయం అందరికీ తెలుసన్నారు. ఇసుక వల్ల కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని మేం కూడా ఒప్పుకుంటున్నాము. అయితే అవినీతి లేకుండా ప్రజలకు ఇసుకను అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందన్నారు. 
 
గతంలో చంద్రబాబు నివాసం చుట్టుపక్కలనుంచి ప్రతిరోజు వందలలారీలు ఇసుక అక్రమ రవాణా జరగుతుంటే అరికట్టేందుకు చర్యలేమైనా తీసుకున్నారా...?  మీ అనుయాయులు, ఎంఎల్ఏలు, మంత్రులు వందలవేల కోట్లు ఇసుక అక్రమరవాణా ద్వారా దోచుకుంది వాస్తవం కాదా...? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వందకోట్ల రూపాయల జరిమానా విధించింది వాస్తవం కాదా ...? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో విశ్వాసం కోల్పోయిన నేతలుగా చంద్రబాబు పవన్ కల్యాణ్ లు మిగిలిపోయారన్నారు. చంద్రబాబు నైజం ప్రజలు తెలుసుకున్నారని...అందుకే ఆయనకు 23 సీట్లు ఇచ్చారని ఎద్దేవాచేశారు. అవి కూడా రాబోయో రోజులలో పోబోతున్నాయని అన్నారు. చంద్రబాబు టిడిపి అధ్యక్షుడిగా ఉంటాడా... ఉండడా అనేది కూడా తెలియడం లేదన్నారు.

త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుందని...ఆ పార్టీ ఉంటుందో లేదో తెలియని గందరగోళ పరిస్దితిలో ఉందన్నారు. కొంతమంది ఎంపీలు ఆ పార్టీ నుంచి ఇప్పటికే వెళ్లిపోయారని...ఎంఎల్ఏలు సైతం వెళ్లిపోతున్నారని తెలిపారు.

పవన్ కల్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయాడు...ఎప్పుడో వస్తాడు.. ఎప్పుడో వెళ్తాడో తేలిదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల గురించి ఆయనకేమీ తెలియదన్నారు. 

సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఐదు నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. రైతులు,ఆటో కార్మికులు,నవరత్నాలు ఇలా అన్నింటిని నెరవేరుస్తున్నారన్నారు.

త ఎంతమంది మా పార్టీలోకి రావాలనుకున్నా...జగన్ గారి నాయకత్వం కావాలనుకున్నా.... విలువలకు కట్టుబడి పదవులకు రాజీనామా చేసి రావాల్సిఉంటుందన్నారు. ప్రతిపక్షనేత రాష్ర్టంలో ఉన్నాడా అనే విధంగా చంద్రబాబు తయారయ్యారని  జోగి రమేష్ విమర్శించారు. 

click me!