ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రస్తుతం నెలకొన్న సందేహాలన్నింటిపై అతిత్వరలో క్లారిటీ రానుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.
అమరావతి: గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. అందుకోసమే వివిధ సంక్షేమ, అభివృద్ది పథకాల్లో గ్రామాలకు పెద్దపీట వేస్తున్నారని... ఆ అభివృద్ధి పచ్చపార్టీ నాయకుల కళ్లకి కనిపించటం లేదా అని ప్రశ్నించారు. కేవలం గ్రామాలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు.
ఇక రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టి అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే తమ ప్రభుత్వం మూడు రాజదానులు ప్రతిపాదన తెచ్చిందన్నారు. దీన్ని వ్యతిరికించడం ప్రతిపక్షాలకు తగదని.. కేవలం ఉనికి కోసమే వారు పోరాటం చేస్తున్నారని అన్నారు.
undefined
కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు కోసం గతంలోనే శ్రీబాగ్ కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. దాని ప్రకారమే ఇప్పుడు హైకోర్టు ప్రతిపాదన తెరపైకి వచ్చిందన్నారు. శాసనాలు చేయటానికి సభావేదిక ను అమరావతి లో ఉంచనున్నట్లు తెలిపారు.
read more కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలు వాయిదా... హైపవర్ కమిటీ ఆలోచన ఇదే
పరిపాలన సౌలభ్యం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసమే విశాఖ ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఇలా అన్నీ ప్రాంతాలని సమానంగా అభివృద్ది చేయటమే సీఎం జగన్ ఉద్దేశమని మంత్రి పేర్కోన్నారు.
రాజధాని కోసం మంత్రులతో ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ వివిధ అంశాలపై సమగ్రంగా అద్యయనం కొనసాగిస్తోందన్నారు. గతంలో శ్రీకృష్ణ కమిటీ ,జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఈ నెల 20 నుండి రెండు మూడు రోజులు శాసనసభ సమావేశాల్లో చర్చ జరిపి రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి కి అన్యాయం జరిగిందంటూ ప్రాంతాల మద్య విభేదాలు తీసుకువచ్చి విద్వేషాలు రేపి ప్రజలలో సెంటి మెంట్ రెచ్చకొట్టటం సరయిన పద్దతి కాదన్నారు. భాద్యత కలిగిన ప్రతి పక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయవలసింది పోయి ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు.
చంద్రబాబు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను పక్కన పెట్టుకుని ఈ నాటకం ఆడిస్తున్నారని అన్నారు. అమరావతిలో ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నట్లు ప్రచారం చేసి అక్కడి ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమం చేయిస్తున్నారని... ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు.
read more పవన్ కల్యాణ్ తో దోస్తీ: చంద్రబాబుకు బిజెపి భారీ షాక్
రాజధాని రైతులు ఎవ్వరికీ ప్రభుత్వం అన్యాయం చేయ్యదని మంత్రి హామీ ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం జగన్ విశేష కృషి చేస్తున్నారని... రైతు సమస్యలు కమిటీ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిగణలోకి తీసుకుని నివేదికలో పొందుపరుస్తామని మంత్రి మోపిదేవి తెలిపారు.