రాయలసీమంటే ఫ్యాక్షనిస్టులు, ఉత్తరాంధ్రంటే కమెడియన్లా..?: అవంతి ఫైర్

By Siva Kodati  |  First Published Jan 12, 2020, 4:56 PM IST

ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు. 


ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు. తన నిజమైన హీరో స్వామి వివేకానంద అని.. భారతేదశం ఉన్నంత కాలం గుర్తిండిపోయే పేరు స్వామి వివేకానంద అన్నారు.

Also Read:మారుతున్న ఏపీ రాజకీయం: టీడీపీ,లెఫ్ట్, జనసేనల మధ్య పొత్తు?

Latest Videos

దేశం బాగుంటేనే అందరం బాగుంటామని, యువత కలలు కని వాటిన సాకారం చేసుకోవాలని అవంతి పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాలుగు లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి ప్రశంసించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో లంచం అనే మాట లేకుండా జగన్ పరిపాలన చేస్తున్నారని అవంతి తెలిపారు. సరైన సదుపాయాలు లేక ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్టులు, ఉత్తరాంధ్ర అంటే కమెడియన్లుగా చూస్తారని అవంతి గుర్తుచేశారు.

Also Read:రాజధానిని మార్చితే అగ్గి రాజుకొంటుంది: జేసీ దివాకర్ రెడ్డి సంచలనం

ఇలాంటి పరిస్ధితి ఉండకూడదనే సీఎం జగన్ తపన అని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెయ్యాలన్నదే ఆయన ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, అమరావతిని అభివృద్ధి చేస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. 

click me!