ముగిసిన ఏపి కేబినెట్ భేటీ...కీలక నిర్ణయాలివే

By Arun Kumar P  |  First Published Dec 27, 2019, 2:46 PM IST

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ సమావేశం శుక్రవారం అమరావతిలో ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేేశంలో రాజధానికి సంబంధించిన అంశాలతో మరిన్న కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. AP Cabinet cricual decisions 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కేబినెట్ భేటీ ముగిసింది. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో రాజధాని తరలింపుపైనే ప్రధానంగా చర్చించారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న సీఎం.. రాజధాని తరలింపుపై తొందరలేదని, ప్రజలకు అన్ని వివరాలు వివరించిన తర్వాతే నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. 

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక ఇచ్చిన తర్వాత రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకుందామని వెల్లడించారు. అనంతరం సమావేశ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.  

Latest Videos

undefined

read more  చంద్రబాబుకు షాక్: సీబీఐకి అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్?

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి నిర్ణయాలు:

పంచాయతీ ఎన్నికల కొరకు 2011 జనాభా గణన ఆధారంగా ఎస్టీలకు 6.77 శాతానికి, ఎస్సీలకు 19.08 శాతానికి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికల నిర్వహణ

412 కొత్త 108 వాహనాల కొనుగోలుకు ఆమోదం, ఇందుకోసం రూ.71.48 లక్షల మంజూరు. అలాగే 656 కొత్త 104 వాహనాల కొనుగోలుకు రూ.60.51 లక్షల మంజూరు

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ఒక సమగ్ర విధానం... ఇందుకోసం రాష్ట్రంలోని 191 వ్యవసాయ మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగాను, 150 ఉప మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగాను మార్చేందుకు ఆమోదం

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ సంస్థకు కృష్ణా జిల్లా సూరంపల్లిలో 6 ఎకరాల భూమిని ఎకరాకు లక్ష చొప్పున కేటాయింపు

రాయచోటిలో వక్ఫ్ బోర్డు భవన నిర్మాణం 

మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు కు డీపీఆర్ కు రైట్స్ సంస్థకు అప్పగింత

read more  ఏపీకి మూడు రాజధానులు: ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత,మీడియాపై దాడి
 
''రాజధాని నిర్మాణంలో కుంభకోణాలు వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చింది. అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. సమగ్ర దర్యాప్తు కోసం న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ చేయించేందుకు నిర్ణయం.

గత ముఖ్యమంత్రి, మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులకు కొనుగోలు చేసిన భూముల పై విచారణ జరుగుతుంది. జులై 2014 లో కొనుగోలు చేసినట్టు  ఆధారాలు ఉన్నాయి. 

రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అధ్యయనం కోసం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదిక ను కేబినెట్ లో చర్చించాము. వారితో పాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కు చెందిన అధ్యయన నివేదిక ఇంకా అందాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ లు ఇచ్చిన నివేదికలు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ భావిస్తోంది.

గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టి నారాయణ కమిటీ నివేదిక ను ఆమోదించింది. మౌలిక సదుపాయాలు ఏర్పాటు కోసం ఎకరాకు 2 కోట్ల చొప్పున 1 లక్షా 10 వేల కోట్లు అంచనా వేశారు.'' అని పేర్ని నాని వెల్లడించారు. 

 

click me!