ఉరిశిక్షకైనా సిద్దమే... కానీ వారికి అన్యాయం జరిగితే మాత్రం...: ధూళిపాళ్ల నరేంద్ర

By Arun Kumar PFirst Published Dec 26, 2019, 5:28 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. అమరావతి రైతులు చేపడుతున్న నిరసన కార్యక్రమంలో టిడిపి నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సతీసమేతంగా పాల్గొన్నారు.  

అమరావతి:  ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో మేము తప్పు చేసినట్టు తేలితే ఉరిశిక్షకైనా సిద్ధమేనని టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. అయితే తమపై కక్షతో అమరావతి కోసం భూములను త్యాగం చేసిన రైతులకు మాత్రం అన్యాయం చెయ్యొద్దని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను వేడుకున్నారు. 

గుంటూరు జిల్లా పొన్నూరులో గురువారం టిడిపి ఆధ్వర్యంలో రాజధాని అమరావతిని తరలించొద్దంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు ధూళిపాళ్ల సతీసమేతంగా హాజరయ్యారు. వీరు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలసి నిరసన ర్యాలీ చేపట్టారు. 

ఈసందర్భంగా ధూళిపాళ్ల మాట్లాడుతూ... గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి పెద్దలు ఆరోజు రాజధాని కోసం 30,000 ఎకరాలు కావాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని సమర్ధించారని పూర్కొన్నారు. కానీ అధికారంలోకి రాగానే మాటమార్చి మూడు రాజధానులంటూ అమరావతి కోసం  భూములు ఇచ్చిన రైతులను వంచించడం పద్ధతి కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

read more  అమరావతి ఉద్యమంలో విషాదం... నడిరోడ్డుపైనే బాధిత రైతు ఆత్మహత్యాయత్నం

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేశామని రుజువు చేస్తే ఉరిశిక్షకైనా సిద్ధమేనని ఆయన తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఐలాండ్ సెంటర్ నుండి జిబిసి రహదారి వెంబడి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇతర నాయకులు,  బాధితులతో కలిసి ధూళిపాళ్ల  తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 27న మౌన దీక్ష చేయనున్నారు. బీజేపీ శ్రేణులతో   కలిసి కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష చేస్తారు.

ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే శుక్రవారం నాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష చేయనున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తోంది.

read more  రేపే ఏపి మంత్రివర్గ సమావేశం...ఇంకా వేదికపై కొనసాగుతున్న సస్పెన్స్

ఈ ప్రతిపాదనను బీజేపీ నిరసిస్తోంది. ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 27వ తేదీన జరగనుంది. జీఎన్ రావు కమిటీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ కేబినెట్ సమావేశంలో జీఎన్ రావు కమిటీతో పాటు  కేబినెట్ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
 

  


 

click me!