టిడిపి నేతలపై దాడిచేసింది కిశోర్... చేయించింది మాత్రం ఆ ఎమ్మెల్యేనే...: అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Mar 11, 2020, 4:48 PM IST
Highlights

గుంటూరు జిల్లా మాచర్లలో టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలపై జరిగిన దాడిపై మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు.

గుంటూరు: రాష్ట్రంలో వైసీపీ నేతల రాక్షసత్వం, ఫ్యాక్షన్ మనస్తత్వం పరాకాష్టకు చేరిందని టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమామమేశ్వరరావు, బుద్దా వెంకన్నపై వైసీపీ మాచర్ల పట్టణ అధ్యక్షుడు తురకా కిశోర్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. 

వైసీపీకి ఓటమి తప్పదన్న విషయం జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ వచ్చేసిందని... అందుకే భయం, అసహనంతో టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలను కూడా తమ కనుసన్నల్లో జరపాలనేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. 

''న్యాయ పరిశీలన కోసం వెళ్లిన మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేస్తారా.? ఇదేనా రాష్ట్రంలో ప్రతిపక్షాలకు, సామాన్యులకు కల్పిస్తున్న భద్రత? పోలీసుల రక్షణలో ఉన్న వ్యక్తులపై కూడా వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారంటే.. ఇక రాష్ట్రంలో బతికేదెలా.? అని సామాన్యులు భయాందోళనలు చెందుతున్నారు'' అని అన్నారు.

read more బోండా ఉమ, బుద్దాలపై దాడిచేసింది ఆ యువకులే...: కేఈ కృష్ణమూర్తి

''ఈ దాడుల వెనుక జగన్మోహన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హస్తం ఉంది. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా. కానీ ఇంత వరకు ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్ని ఎక్కడా చూడలేదు. ఇలాంటి అకృత్యాలు, అరాచకాలు ఎన్నడూ ఎరుగను. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చేసిన ప్రమాణస్వీకారాన్ని తొమ్మిది నెలల్లోనే తుంగలో తొక్కారు'' అంటూ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.

''తాజా ఘటనల నేపథ్యంలో మాచర్లలో ఎన్నికలను రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. స్వేచ్ఛాయుతంగా నామినేషన్లు వేసే వాతావరణం కల్పించాలి. దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపాలి'' అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

read more  మాచర్ల ఘటనపై స్పందించిన డిజిపి... ఐజి, ఎస్పీలకు ఆదేశాలు

  
 

click me!