వైఎస్సార్ కాంగ్రెెస్ నాయకులు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెెడ్డిపై జరిగిన దాడిపై స్పందిస్తూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలు బాగుండాలనే వైఎస్ జగన్ తాపత్రయపడుతున్నారని... ఆయన ఆలోచనలు, నిర్ణయాల్లో అదే ప్రస్పుటంగా కనిపిస్తోందని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్ర రాజధానిపై తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలని ఉద్దేశించిందేనని... ఏ ప్రాంతానికి అన్యాయం చేయాలని కాదన్నారు.
టిడిపి అధ్యక్షులు చంద్రబాబు తన భాషను అదుపులో పెట్టుకోవాలని రాంబాబు హెచ్చరించారు. ఇటీవల అమరావతి ఉద్యమం, రైతుల ముసుగులో టిడిపి దాడులకు పాల్పడుతోందని... అందులో బాగంగానే మంగళవారం తమ ఎమ్మెల్యేపై దాడి జరిగిందన్నారు. మొన్న విలేకరి, యాంకర్ దీప్తిపై, ఇవాళ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడి చంద్రబాబు కుట్రేనని ఆరోపించారు.
undefined
చంద్రబాబు కనుసన్నల్లో పిన్నెల్లి జరిగింది కేవలం దాడి మాత్రమే కాదు హత్యాయత్నం అని ఆరోపించారు. తన స్వార్దం కోసం చంద్రబాబు ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడని అన్నారు. తన పదవికోసం స్వర్గీయ ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు.
read more రైతులు మందుకొట్టి వస్తారా, వాళ్లు టీడీపీ మనుషులే.. బాబు పనే: పిన్నెల్లి వ్యాఖ్యలు
వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా తన ఆస్తులను కాపాడుకునేందుకు వంగవీటి రంగాని దారుణంగా చంపించింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. హింసను ప్రేరేపించడానకి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని... అలా చేస్తే చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోబోమని అంబటి హెచ్చరించారు.
చంద్రబాబు చర్యలను చూస్తూ ఊరుకునే పరిస్దితి లేదని... ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడికి బాధ్యుడైన ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ఎప్పుడైనా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారా అని నిలదీశారు.
గతంలో చంద్రబాబు అధికారంలో వుండగా ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ పై విశాఖలో ఎయిర్ పోర్టులో దాడి చేస్తే తాము సంయమనంతో వ్యవహరించామన్నారు. నాయకులు గానీ, కార్యకర్తలు గానీ హింసాత్మక సంఘటలకు పాల్పడ్డామా అని ప్రశ్నించారు. తమ నాయకుడు జగన్ ని అక్రమంగా జైలులో పెట్టించినా కూడా తామంతా శాంతియుతంగానే నిరసనలు తెలియచేశామని అన్నారు.
read more రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్నదే నా అభిప్రాయం... కానీ..: వైసిపి ఎమ్మెల్యే
చంద్రబాబు రైతులను రెచ్చగొట్టడం ఆపాలని సూచించారు. అలాగే రైతులు కూడా దౌర్జన్యంగా ఏమీ సాధించలేరన్నారు. తమ సమస్యలను పరిష్కరించడానికి ప్రజాస్వామ్య పద్దతుల్లో ఉద్యమించాలని సూచించారు. అమరావతి కోసం భూములను త్యాగం చేసిన రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సైతం సిద్దంగా ఉందని అంబటి సూచించారు.