అమరావతి ఉద్యమంలో విషాదం... మరో రైతు మృతి

By Arun Kumar PFirst Published Jan 6, 2020, 8:43 PM IST
Highlights

ప్రభుత్వం రాజధాని తరలింపు నిర్ణయాన్ని కోసం గత 20 రోజులుగా నిరసన చేపడుతున్న అమరావతి ఉద్యమంలో మరో విషాదం చోటుచేసుకుంది. మరో  రాజధాని రైతు గుండెపోటుతో మృతిచెందాడు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ సాగుతున్న నిరసనల్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు ఉద్యమకారులు తమ ప్రాంతంకోసం ఉద్యమంలో పాల్గోంటూ ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో వ్యక్తి కూడా అసువులు బాసాడు. రాజధాని అమరావతి ప్రాతంలో మరో రైతు గుండెపోటుకు గురవడయి చివరికి ప్రాణాలను కోల్పోయాడు. 

వెలగపూడికి చెందిన గోపాలరావు అనే వృద్దుడు వయస్సు మీదపడినప్పటికి ఆరోగ్యంగా వుండేవాడు. అయితే అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న తన మనవడిని పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్త విని అతడు తట్టుకోలేకపోయాడు. దీంతో గుండెపోటుకు గురయి మృతిచెందాడు. ఈ మృతితో వెలగపూడి ప్రాంతంలోనే కాదు అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న గ్రామాలన్నింటిని విషాదం చోటుచేసుకుంది. 

read more  జేసీ దివాకర్ రెడ్డి కొత్త ప్రతిపాదన: కేంద్రపాలిత ప్రాంతంగా రాయలసీమ

రాజధాని తరలింపును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న క్రమంలో మందడంలో ఆదివారం ఓ రైతు స్పహ తప్పిపడిపోయాడు. ఇలా అనారోగ్యంపాలయిన రైతు సాయంత్రం మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. 

తాళ్లాయపాలెంకు చెందిన కొండేపాటి సుబ్బయ్య అనే రైతు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా నిరసన దీక్షలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి ఏమి తినకపోవడంతో ఆదివారం ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తోటి రైతులు ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు.

read more  అంతకు మించి... ఆ పోలీసులు రిటైరయినా వదిలిపెట్టం...: చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

ఇప్పటికే రాజధాని తరలిస్తున్నారని పుట్టెడు బాధలో వున్నరైతులను మరణాలు మరింత బాధిస్తున్నారు. తమతో పాటు ఉద్యమం చేస్తున్న సహచరులు హటాత్తుగా మరణిస్తుండటం అందరినీ ఎంతగానో బాధిస్తోంది. ఇలా నిన్న చనిపోయిన రైతు కుటుంబాన్ని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పరామర్శించారు. 


 

 

click me!