అమరావతి ప్రాంత ప్రజలు రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమం 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆదివాారం చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణనను ముందుగానే ప్రకటించారు.
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు గతకొద్ది రోజులుగా నిరసన బాట పట్టారు. ఇలా వారు చేస్తున్న ఉద్యమం రేపటితో 19వ రోజుకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు సంబంధించిన ఐక్య కార్యాచరణను కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.
మందడంలో 19వ రోజు మహా ధర్నా, వెలగపూడిలో 19వ రోజు రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే రాజధాని శంకుస్థాపన ప్రదేశంలో ఉద్దండరాయునిపాలెంలో గ్రామస్తులంతా పొంగళ్లు తయారుచేసి నిరసన తెలియజేయనున్నారు.
undefined
ఇక తుళ్ళూరులో 19వ రోజు మహా ధర్నాతో పాటు వంటా-వార్పు చేపట్టి రోడ్లపైనే బోజనం చేయనున్నారు.అంతేకాకుండా తుళ్ళూరు మహిళలు మరికొంత వినూత్నంగా నిరసన తెలియజేయడానికి సిద్దమయ్యారు. ఆదివారమంతా ఈ గ్రామానికి చెందిన మహిళలు పచ్చరంగు గాజులు వేసుకుని నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. పెదపరిమి గ్రామంలో నిరసనలు, ధర్నా కొనసాగనుంది.
read more ఏపి రాజధాని ఎక్కడున్నా సరే... అవన్నీ వుండాల్సిందే: మాజీ మంత్రి బండారు
ఇవాళ(శనివారం, 18రోజు) కూడా రోజూ మాదిరిగానే రాజధాని ఉద్యమం ఉదృతంగా సాగింది. శుక్రవారం మందడంలో మహిళలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఉదయాన్నే మహిళలంతా రోడ్డుపైకి వచ్చారు. పోలీసు తీరును వ్యతిరేకిస్తూ మళ్లీ మందడం మహిళలు నిరసనకు దిగారు.
రాజధాని రైతులు తుళ్ళూరులో చేస్తున్న ధర్నాకు వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. అయితే గ్రామస్తులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా టెంటుల్లోనే కూర్చుని ధర్నా చేశారు. ధర్నాలో నిరసనకారులు కొందరు సీఎం జగన్ ను ఇమిటేట్ చేస్తూ అధికారులను ఉద్దేశించి స్పీచులిచ్చారు. అయ్యా..అధికారులూ అంటూ వైఎస్సార్, జగన్ స్టైల్లో మాట్లాడారు.
మిగతా రాజధాని గ్రామాల్లో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. రేపు ఆదివారం ఉద్యమాన్ని మరింత ఉదృతంగా చేపట్టేందుకు అమరావతి ప్రాంత గ్రామాల ప్రజలంతా ముందుగానే సంసిద్దమయ్యారు.